Rohit Sharma: రోహిత్ శర్మ ఇంట్లోకి 'జూనియర్ హిట్‌మ్యాన్' ఆగయా.. అభిమానుల విషెస్..
ABN , Publish Date - Nov 16 , 2024 | 07:51 AM
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండోసారి తండ్రయ్యాడు. రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ విషయాన్ని రోహిత్, రితికా ధృవీకరించలేదు. అయితే పెర్త్ టెస్టులో రోహిత్ పాల్గొంటాడా లేదా అనే ప్రశ్న అందరిలో మెదులుతోంది.
టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) రెండోసారి తండ్రి అయ్యాడు. నివేదికల ప్రకారం ఆయన భార్య రితికా సజ్దే నవంబర్ 15న అర్థరాత్రి ఒక కొడుకుకు జన్మనిచ్చింది. అయితే ఈ విషయాన్ని రోహిత్, రితికా ఇంకా ధృవీకరించలేదు. ఈ క్రమంలో రోహిత్ ఇంటికి జూనియర్ హిట్ మ్యాన్ వచ్చాడని అభిమానులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు. రోహిత్ ఇంటికి త్వరలో శుభవార్త రాబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి.
వీరి పెళ్లి ఎప్పుడంటే..
రోహిత్ శర్మ డిసెంబర్ 13, 2015న రితికా సజ్దేను వివాహం చేసుకున్నాడు. డిసెంబర్ 30, 2018న, రితికా సమైరా అనే కుమార్తెకు జన్మనిచ్చింది. సమైరాకు ఇప్పుడు ఐదేళ్లు.
ఆస్ట్రేలియా తొలి టెస్టులో ఆడడంపై అనుమానం
నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో రోహిత్ భారత్‌కు నాయకత్వం వహించనున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు ఆస్ట్రేలియా చేరుకుంది. ఈ క్రమంలో పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ ఫ్యామిలీలో రెండో బిడ్డ పుట్టడంతో జట్టుతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లలేదు. దీంతో మొదటి మ్యాచ్ ఆడటానికి ఆస్ట్రేలియా వెళ్తాడా లేదా కుటుంబంతో కొంత సమయం గడపాలనుకుంటున్నాడా అనేది ఆసక్తికరంగా మారింది.
ప్రధాన కోచ్ ఎమన్నారంటే..
రోహిత్ మొదటి టెస్టులో ఆడతాడా లేదా అనేది ఇంకా ధృవీకరించబడలేదు. ఆస్ట్రేలియాకు బయలుదేరే ముందు, ప్రధాన కోచ్ గౌతం గంభీర్ మాట్లాడుతూ, రోహిత్ మొదటి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనే దానిపై తన వద్ద ఖచ్చితమైన సమాచారం లేదని చెప్పాడు. దీని గురించి ప్రస్తుతానికి ఏమీ చెప్పలేనని గంభీర్ అన్నారు. మరికొన్ని రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ రానుంది. అతను అందుబాటులో ఉంటాడని అంతా భావిస్తున్నట్లు వెల్లడించారు. రోహిత్ శర్మ పెర్త్ టెస్టులో పాల్గొనకపోతే, జట్టు కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా వ్యవహరించే అవకాశం ఉంది.
కానీ రోహిత్ ప్రాక్టీస్ చేస్తూ
రోహిత్ ఆస్ట్రేలియాకు వెళ్లకపోయినా జట్టుకు దూరమైనా ఈ సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. కొన్ని రోజుల క్రితం రోహిత్ ముంబైలో నెట్స్‌లో గడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గత కొంత కాలంగా రోహిత్ బ్యాటింగ్ సరిగా లేదు. పరుగులు రాబట్టలేక ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో రోహిత్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ప్రస్తుత సంవత్సరంలో రోహిత్ 11 టెస్ట్ మ్యాచ్‌లలో 29.40 సగటుతో 588 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, అనేక అర్ధ సెంచరీలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
Fire Accident: మెడికల్ కాలేజీలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది చిన్నారులు మృతి
PAN Aadhaar: పాన్ ఆధార్ ఇంకా లింక్ చేయలేదా.. ఇప్పుడే చేసుకోండి, గడవు సమీపిస్తోంది..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Credit Card New Rules: క్రెడిట్ కార్డ్ యూజర్లకు అలర్ట్.. నవంబర్ 15 నుంచి కొత్త రూల్స్..
Read More National News and Latest Telugu News