Share News

Rohit Sharma: వచ్చే ఏడాది రోహిత్ చెన్నై తరఫున ఆడబోతున్నాడు.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!

ABN , Publish Date - Apr 13 , 2024 | 07:48 PM

ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో రోహిత్ శర్మకు కాకుండా హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ అప్పగించడంపై చర్చ సాగుతూనే ఉంది. రోహితే కెప్టెన్‌గా ఉండాలంటూ ముంబై అభిమానులు నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ప్రత్యక్షంగా, సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేస్తున్నారు.

Rohit Sharma: వచ్చే ఏడాది రోహిత్ చెన్నై తరఫున ఆడబోతున్నాడు.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
ధోనీతో రోహిత్ శర్మ

ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో (IPL 2024) రోహిత్ శర్మకు (Rohit Sharma) కాకుండా హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ (MI Captain) కెప్టెన్సీ అప్పగించడంపై చర్చ సాగుతూనే ఉంది. రోహితే కెప్టెన్‌గా ఉండాలంటూ ముంబై అభిమానులు నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యాను (Hardik Pandya) ప్రత్యక్షంగా, సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ (Michael Vaughan) సంచలన కామెంట్స్ చేశాడు. వచ్చే ఏడాది ముంబై టీమ్‌ను రోహిత్ వీడబోతున్నాడని వాన్ అభిప్రాయపడ్డాడు.


``వచ్చే ఏడాది రోహిత్ శర్మను చెన్నైలో (CSK) చూస్తానని అనుకుంటున్నా. రుతురాజ్ ఈ ఒక్క ఏడాదే చెన్నై కెప్టెన్‌గా ఉంటాడేమో. వచ్చే సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు రోహిత్‌ను కెప్టెన్‌గా చేస్తారు. లేదా అతడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కూడా వెళ్లొచ్చు. గతంలో అతడు డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడాడు. ముంబై జట్టుకు హార్దిక్ రావడంతోనే ఇబ్బందులు తలెత్తాయి. ముంబై టీమ్ కెప్టెన్సీ బాధ్యతలను హార్దిక్ అడిగి తీసుకున్నాడు. ప్రతి భారత క్రికెటర్ ముంబై వంటి టీమ్‌కు కెప్టెన్‌గా చేయాలని అనుకుంటాడ``ని వాన్ పేర్కొన్నాడు.


``వ్యక్తిగతంగా నేను రోహిత్ కెప్టెన్సీనే ఇష్టపడతా. వచ్చే వరల్డ్‌కప్‌లో భారత్‌ను నడిపించబోయేది రోహిత్ శర్మనే. రోహిత్ మరికొన్ని సంవత్సరాలు మెరుగైన క్రికెట్ ఆడగలడు. రోహిత్‌ను మళ్లీ కెప్టెన్‌గా చేస్తే ముంబైకే మంచిది. లేకపోతే రోహిత్‌ను చేజార్చుకోవడానికి వాళ్లు సిద్ధపడాలి. రోహిత్ ముంబై జట్టును వీడితే అభిమానుల హృదయాలు ముక్కలైపోతాయ``ని వాన్ ఓ పాడ్‌కాస్ట్‌లో చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి..

Virat Kohli: ‘టీ20 వరల్డ్ కప్‌‌ జట్టులో విరాట్ కోహ్లీ ఉండకూడదు’


MI Vs RCB-IPL: ముంబై, బెంగళూరు మధ్య మ్యాచ్‌లో టాస్ ట్యాంపరింగ్?.. ఫ్యాక్ట్ చెక్‌లో ఏం తేలిదంటే?


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 13 , 2024 | 07:48 PM