Share News

IPL 2024: నేడు RCB vs KKR మ్యాచ్.. సొంత మైదానంలో గెలుపు పక్కా? విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే?

ABN , Publish Date - Mar 29 , 2024 | 07:06 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(IPL 2024) సీజన్‌ 17లో 10వ మ్యాచ్‌లో శుక్రవారం (మార్చి 29న) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సొంత మైదానంలో జరగనున్న ఈ గేమ్ ఎవరు గెలిచే అవకాశం ఉంది, గెలుపు అంచనాలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చుద్దాం.

IPL 2024: నేడు RCB vs KKR మ్యాచ్.. సొంత మైదానంలో గెలుపు పక్కా? విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(IPL 2024) సీజన్‌ 17లో 10వ మ్యాచ్‌ శుక్రవారం (మార్చి 29న) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలో ఇది RCBకి మూడవ గేమ్, మరోవైపు KKR ఇప్పటివరకు ఒకే ఒక గేమ్ ఆడి గెలిచింది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో మార్చి 23న మ్యాచ్‌లో కేకేఆర్ నాలుగు పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది.

మరోవైపు RCB వారి మొదటి గేమ్‌లో CSK చేతిలో ఓడిపోయారు. అయితే గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి బోర్డులో మొదటి పాయింట్‌ను పొందారు. ఆఖరి ఓవర్లో దినేష్ కార్తీక్ ఫినిషింగ్ టచ్ ఇచ్చి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ నేపథ్యంలో RCB అదే గెలుపు జోరును కొనసాగించి పాయింట్ల పట్టికలో ముందుకు సాగాలని భావిస్తోంది.


ఈ క్రమంలో RCB, KKR మధ్య ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా కొనసాగనుంది. ఎందుకంటే రెండు జట్లూ కూడా అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌లను కలిగి ఉన్నాయి.

మరోవైపు బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ టీ20 ఫార్మాట్‌లో బ్యాట్స్‌మెన్‌లకు స్వర్గధామం అని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్న ట్రాక్ బ్యాట్స్‌మెన్‌లకు చాలా సహాయపడుతుంది. ఇక్కడ ఉన్న చిన్న బౌండరీ కారణంగా బ్యాట్స్‌మెన్ లాంగ్ హిట్లు కొట్టేందుకు వెనుకాడరు. దీంతో ఈ మ్యాచ్‌లో అధిక స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఈ మ్యాచులో గూగుల్ అంచనా ప్రకారం RCB 53 శాతం గెల్చేందుకు అవకాశం ఉండగా, కేకేఆర్ జట్టుకు 47 శాతం గెలిచే ఛాన్స్ ఉందని తెలిపింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) జట్టులో ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, కెమెరూన్ గ్రీన్, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్ ఉన్నారు.

కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) జట్టులో ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రమణదీప్ సింగ్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, మిచెల్ స్టార్క్ , హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి కలరు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: విహారికి ఏసీఏ షోకాజ్‌ నోటీసు

Updated Date - Mar 29 , 2024 | 07:09 AM