Viral Video: సచిన్ టెండూల్కర్‌ను చిత్తుగా ఔట్ చేసిన యువ బౌలర్
ABN , Publish Date - Mar 07 , 2024 | 11:50 AM
దేశంలో ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. ఈ టోర్నీ ప్రారంభానికి ముందు ఎగ్జిబిషన్ మ్యాచ్ జరుగగా అందులో సచిన్(sachin tendulkar ) పాల్గొని క్రికెట్ ఆడారు. ఆ క్రమంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
దేశంలో ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. ఈ టోర్నీ ప్రారంభానికి ముందు ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది. దీనిలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(sachin tendulkar) పాల్గొని బ్యాటింగ్ చేయగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అందులో భాగంగా బిగ్ బాస్ 17వ సీజన్ విజేత మునవర్ ఫరూఖీ(munawar faruqui) వేసిన బంతికి సచిన్ సులభంగా క్యాచ్ అవుట్ అయ్యారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో తెగ వైరల్ అవుతోంది.
ఈ మ్యాచులో టెండూల్కర్ 17 బంతుల్లో 30 పరుగులు చేసినప్పటికీ ఫరూఖీ మాస్టర్ బ్లాస్టర్‌ను అవుట్ చేసిన వీడియో(Viral Video) నెట్టింట చక్కర్లు కోడుతోంది. వీడియోలో ఫరూఖీ వేసిన బంతికి టెండూల్కర్(tendulkar) భారీ షాట్ కొట్టాలనుకున్నాడు. కానీ ఆ క్రమంలో బంతి బ్యాటుకు తగిలి సులభంగా క్యాచ్ అయ్యింది. దీంతో మునవర్ ఫరూఖీ ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. అది చూసిన అనేక మంది ఆశ్చర్యపోయారు. చాలా మంది దిగ్గజ బౌలర్లు తమ కెరీర్‌లో మాస్టర్ బ్లాస్టర్‌ను ఔట్ చేయడంలో విఫలమయ్యారని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం పలువురి దృష్టి ఫరూఖీ(faruqui)కి పడింది.
ఇక 24 ఏళ్ల పాటు భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్(sachin tendulkar) తన కెరీర్‌లో మొత్తం 200 టెస్టులు, 463 వన్డేలు, 1 టీ20 మ్యాచ్ ఆడాడు. టెస్టుల్లో 53 సగటుతో 15,921 పరుగులు చేశాడు. ఈ సమయంలో 51 సెంచరీలు, 68 అర్ధ సెంచరీలు కూడా చేశారు. కాగా వన్డేల్లో సచిన్ 44 సగటుతో 18426 పరుగులు చేశారు. వన్డేల్లో 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఏకైక టీ20లో సచిన్ టెండూల్కర్ 10 పరుగులు చేశాడు. టెండూల్కర్ టెస్టులో 46, వన్డేల్లో 154, టీ20లో 1 వికెట్ సాధించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Viral: ఈ 22 ఏళ్ల యువతి కొన్ని సంవత్సరాలుగా స్నానం చేయలేదు.. కారణం ఏంటో తెలిస్తే..!