Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Viral Video: చాహల్‌ను ఎత్తుకుని గిరగిరా తిప్పేసిన సంగీతా ఫోగట్

ABN , Publish Date - Mar 03 , 2024 | 11:26 AM

25 ఏళ్ల యువతి సంగీతా ఫోగట్‌ భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు చెమటలు పట్టించింది. ఏకంగా చాహల్‌ను భుజాలపై ఎత్తుకుని గిరగిరా తిప్పేసింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.

Viral Video: చాహల్‌ను ఎత్తుకుని గిరగిరా తిప్పేసిన సంగీతా ఫోగట్

భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్(yuzvendra Chahal), రెజ్లర్ సంగీతా ఫోగట్‌(Sangeeta Phogat)కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. వీడియోలో సంగీతా చాహల్‌ను తన భుజాలపై ఎత్తుకుని గిరగిరా తెప్పేసింది. ఆ సమయంలో చాహల్‌ భయంతో సంగీతను ఆపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు చాహల్ ముఖంలో ఆందోళన కూడా కనిపించింది. 25 ఏళ్ల సంగీతా ఫోగట్ చాహల్‌ను చాలా తేలికగా ఊపుతూ వీడియోలో కనిపించింది.

అయితే ఈ వైరల్ వీడియో 'ఝలక్ దిఖ్లా జా(Jhalak Dikhhla Jaa)' టీవీ ప్రోగ్రామ్‌లోనిది. శుక్రవారం దాని సెట్‌కి చేరుకున్న యుజ్వేంద్ర చాహల్, మహిళా రెజ్లర్ సంగీతా ఫోగట్‌తో సరదాగా గడిపిన క్రమంలో చిత్రీకరించారు. వీడియోలో సంగీతా చాహల్‌ను తన వీపుపైకి ఎత్తుకుని డ్యాన్స్ చేయడాన్ని చూడవచ్చు. ఈ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. చాహల్ భార్య ధనశ్రీతో కలిసి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తున్నాడు.


చాహల్ తన వైరల్ వీడియోల కారణంగా వార్తల్లో నిలిచాడు. బీసీసీఐ(BCCI) సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి చాహల్‌ను తొలగించడంపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చాహల్‌ను మినహాయించడం అంటే సెలక్షన్ కమిటీ ఇతర ఎంపికలను పరిశీలిస్తున్నట్లు కూడా అతను చెప్పాడు. చాహల్(Chahal) పేరు జాబితాలో లేకపోవడం కొంచెం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు.

ఇక భారతీయ మహిళా రెజ్లర్ సంగీతా ఫోగట్(Sangeeta Phogat) 59 కిలోల ఫ్రీస్టైల్ విభాగంలో రెజ్లర్. ఫోగట్ సోదరీమణులలో చిన్నదైన సంగీతా కూడా రెజ్లర్ల ప్రదర్శనలో పాలుపంచుకుంది. సంగీత ఒలింపిక్ కాంస్య పతక విజేత. ఇది కాకుండా ఆమె ఒలింపిక్ కాంస్య పతక విజేత బజరంగ్ పునియా భార్య, కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేత గీతా ఫోగట్ సోదరి కావడం విశేషం.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Israel Hamas War: గాజా శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ దాడుల్లో 11 మంది మృతి.. WHO స్పందన

Updated Date - Mar 03 , 2024 | 11:26 AM