Share News

World Record : బాష్‌ ప్రపంచ రికార్డు

ABN , Publish Date - Dec 28 , 2024 | 03:10 AM

పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఆటగాడు కార్బిన్‌ బాష్‌ ప్రపంచ రికార్డుతో అదరగొట్టాడు.

 World Record : బాష్‌ ప్రపంచ రికార్డు

  • దక్షిణాఫ్రికాకు ఆధిక్యం

  • పాక్‌తో తొలి టెస్టు

సెంచూరియన్‌: పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఆటగాడు కార్బిన్‌ బాష్‌ ప్రపంచ రికార్డుతో అదరగొట్టాడు. అరంగేట్రం మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీయడంతోపాటు అర్ధ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. అంతేకాదు..అరంగేట్రంలో తొమ్మిదో ఆటగాడిగా బ్యాటింగ్‌కు దిగి అత్యధిక స్కోరు (81 నాటౌట్‌) చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడిగా కూడా రికార్డు నెలకొల్పాడు. కాగా క్రితంరోజు స్కోరు 82/3తో రెండో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా 301 పరుగులకు ఆలౌటై 90 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్నందుకుంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన పాకిస్థాన్‌ ఆట ముగిసే సమయానికి 22 ఓవర్లలో 3 వికెట్లకు 88 పరుగులు చేసింది. పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 211 పరుగులు సాధించింది.

Updated Date - Dec 28 , 2024 | 03:10 AM