T20 World Cup 2024: పాకిస్తాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విజయానికి కారణాలివే.. లేదంటే
ABN , Publish Date - Jun 10 , 2024 | 08:33 AM
న్యూయార్క్‌లో నిన్న రాత్రి జరిగిన భారత్(Team India), పాకిస్తాన్(Pakistan) టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2024) మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 119 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంత తక్కువ స్కోర్ చేసిన భారత్ గెలవడం కష్టమేనని క్రీడాభిమానులు అనుకున్నారు కానీ గెలిచింది. అయితే ఈ మ్యాచ్ గెలుపునకు గల కారణాలను ఇప్పుడు చుద్దాం.
న్యూయార్క్‌లో నిన్న రాత్రి జరిగిన భారత్(Team India), పాకిస్తాన్(Pakistan) టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2024) మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 119 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంత తక్కువ స్కోర్ చేసిన భారత్ గెలవడం కష్టమేనని క్రీడాభిమానులు అనుకున్నారు. కానీ అనుహ్యంగా పాకిస్థాన్ జట్టు 20 ఓవర్లలో కేవలం 113 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.
చివరి ఓవర్లో పాకిస్తాన్ విజయానికి 18 పరుగులు రావాల్సి ఉండగా, భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన జస్ప్రీత్ బుమ్రాకు(jasprit bumrah) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అయితే టీమిండియా మ్యాచ్ గెలుపునకు గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మ్యాచ్‌లో బుమ్రా(jasprit bumrah) 4 ఓవర్లలో 14 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి వావ్ అనిపించాడు. బుమ్రా బౌలింగ్ సమయంలో కీలక ఆటగాళ్లైన బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తికర్ అహ్మద్‌లను అవుట్ చేసి టీమిండియా విజయానికి తోడ్పాటునందించాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ టైటిల్‌ను అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో రిజ్వాన్ జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు. రిజ్వాన్ క్రీజులో ఉన్నంత వరకు భారత జట్టు ఓటమి ప్రమాదంలో పడింది. కానీ 15వ ఓవర్ తొలి బంతికి రిజ్వాన్‌ను బుమ్రా(bumrah) బౌల్డ్ చేయడంతో భారత్‌కు గెలుపు ఆశలు పుంజుకున్నాయి. రిజ్వాన్ అవుటైన వెంటనే పాకిస్థాన్ ఓటమి(Pakistan lose) భయంలో పడింది. ఈ మ్యాచ్‌లో రిజ్వాన్ 44 బంతుల్లో 31 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. రిజ్వాన్ అవుటయ్యే సమయానికి పాకిస్తాన్ స్కోరు 14.1 ఓవర్లలో 80 పరుగులు.
మరోవైపు ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్(Axar Patel) కూడా అదరగొట్టాడు. 2 ఓవర్లలో 11 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. ఈ మ్యాచ్‌లో అక్షర్ అలాంటి ఓవర్ బౌలింగ్ చేయడం మ్యాచ్‌లో సంచలనం సృష్టించింది. పాక్ ఇన్నింగ్స్ 16వ ఓవర్లో అక్షర్ వేసిన 4 బంతుల్లో ఇమాద్ వాసిమ్ ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. ఈ ఓవర్‌లో అక్షర్ 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. భారత్ విజయానికి ఈ ఓవర్ అత్యంత కీలకమని చెప్పవచ్చు.
ఈ కీలక మ్యాచ్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీ అద్భుతంగా ఉంది. రోహిత్ తన బౌలర్లను సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా భారత్ గెలిచిందనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ స్పిన్నర్లను ఉపయోగించాడు. వికెట్ అవసరమని రోహిత్ భావించినప్పుడల్లా అతను బంతిని బుమ్రాకి ఇచ్చాడు. బుమ్రా కూడా కెప్టెన్‌పై నమ్మకం ఉంచి వికెట్ తీయడంనల మ్యాచ్‌లో పెద్ద మార్పు వచ్చింది.
ఒకవైపు బుమ్రా తన బౌలింగ్‌తో పాక్‌కు ఓటమి భాగ్యం రాస్తే మరోవైపు హార్దిక్(Hardik Pandya) ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. నీలిరంగు జెర్సీ ధరిస్తే భారత్‌కు ఎంత పెద్ద ఆటగాడు అవుతాడో హార్దిక్ మరోసారి నిరూపించాడు. హార్దిక్ వేసిన ఈ 4 ఓవర్లు మ్యాచ్‌లో చాలా ముఖ్యమైనవిగా నిరూపించబడ్డాయి. వాస్తవానికి పాక్ బ్యాట్స్‌మెన్ హార్దిక్, సిరాజ్‌లపై దూకుడుగా బ్యాటింగ్ చేయడానికి వ్యూహం రూపొందించబడింది. పాక్ వ్యూహాన్ని ఇద్దరు బౌలర్లు విఫలం చేశారు.
ఇది కూడా చదవండి:
Read Latest Sports News and Telugu News