Virat Kohli- Rohit Sharma: అందుకే ఆ ఫొటో గురించి రోహిత్‌ను అడిగా.. ఇది నిజంగా చాలా ప్రత్యేకం: కోహ్లీ
ABN , Publish Date - Jul 02 , 2024 | 11:53 AM
దాదాపు 17 ఏళ్ల తర్వాత టీమిండియా టీ20 ప్రపంచకప్‌ను దక్కించుకుని అభిమానులకు సంతోషాన్ని అందించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు టీమిండియాపై ప్రశంసలు కురిపించారు. ఈ ప్రపంచకప్ టీమిండియాకు దక్కడంలో కీలక పాత్ర పోషించిన దిగ్గజ ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు.
దాదాపు 17 ఏళ్ల తర్వాత టీమిండియా టీ20 ప్రపంచకప్‌ను (T20 Worldcup) దక్కించుకుని అభిమానులకు సంతోషాన్ని అందించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు టీమిండియా (Teamindia)పై ప్రశంసలు కురిపించారు. ఈ ప్రపంచకప్ టీమిండియాకు దక్కడంలో కీలక పాత్ర పోషించిన దిగ్గజ ఆటగాళ్లైన రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఘన విజయంతో అంతర్జాతీయ టీ-20లకు రిటైర్మెంట్ ప్రకటించేశారు.
మ్యాచ్ అనంతరం రోహిత్, విరాట్ కోహ్లీ మైదానంలో జాతీయ జెండా కప్పుకుని, ట్రోఫీ పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఐకానిక్ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ ఫొటోపై తాజాగా కోహ్లీ స్పందించాడు. ``ప్రపంచకప్ ట్రోఫీతో ఇద్దరం కలిసి ఫొటో దిగుదాం అని నేనే రోహిత్‌ను అడిగాను. ప్రపంచకప్ గెలవడం మా ఇద్దరికీ ఎంతో ప్రత్యేకం. అతని కుటుంబం విండీస్‌లోనే ఉంది. రోహిత్ కూతురు సమైరా అతడి భుజాలపై ఉంది. ఈ విజయంలో అతడి పాత్ర ఎంతో ఉంది. మా ఇద్దరి ప్రయాణం చాలా సుదీర్ఘమైనది. అందుకే ట్రోఫీతో కలిసి ఫొటో దిగుదామ``ని అడిగా.
కాగా, గతంలో రోహిత్, కోహ్లీ ప్రపంచకప్ సాధించిన టీమిండియాలో సభ్యులు. 2007లో టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచినపుడు టీమ్‌లో రోహిత్ ఉన్నాడు. అప్పటికి కోహ్లీ ఇంకా అరంగేట్రం చేయలేదు. ఇక, 2011లో టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలిచినపుడు జట్టులో కోహ్లీ ఉన్నాడు. అప్పుడు రోహిత్‌కు జట్టులో చోటు దక్కలేదు. రోహిత్, కోహ్లీ కలిసి ఒకే జట్టులో ఉండి ప్రపంచకప్ సాధించడం మాత్రం ఇదే తొలిసారి.
ఇవి కూడా చదవండి..
T20 World Cup: బార్బడోస్‌లోనే భారత ఆటగాళ్లు.. ఎయిర్‌పోర్టు మూసివేత.. కారణం ఇదే!
Rohirat: రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆ ఆందోళన అక్కర్లేదు
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..