Share News

T20 World Cup: బార్బడోస్‌లోనే భారత ఆటగాళ్లు.. ఎయిర్‌పోర్టు మూసివేత.. కారణం ఇదే!

ABN , Publish Date - Jul 01 , 2024 | 02:05 PM

టీ20 వరల్డ్‌కప్‌లో ఛాంపియన్స్‌గా అవతరించిన భారత జట్టుని ఘనంగా స్వాగతం పలికేందుకు క్రీడాభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వాళ్లు భారత గడ్డపై తిరిగి అడుగుపెడతారా..

T20 World Cup: బార్బడోస్‌లోనే భారత ఆటగాళ్లు.. ఎయిర్‌పోర్టు మూసివేత.. కారణం ఇదే!
Indian Cricket Players Stuck In Barbados

టీ20 వరల్డ్‌కప్‌లో (T20 World Cup) ఛాంపియన్స్‌గా అవతరించిన భారత జట్టుని (Indian Cricket Team) ఘనంగా స్వాగతం పలికేందుకు క్రీడాభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వాళ్లు భారత గడ్డపై తిరిగి అడుగుపెడతారా.. బ్యాండ్ మేళాలతో వారిని స్వాగతిద్దామా అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సిద్ధం చేసుకున్నారు కూడా! కానీ.. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో, అభిమానుల నిరీక్షణ మరింత పెరిగేలా ఉంది. భారత ఆటగాళ్ల రాక కోసం.. ఇంకొన్నాళ్ల పాటు వారికి వెయిట్ చేయక తప్పదని స్పష్టమవుతోంది.


నిజానికి.. షెడ్యూల్ ప్రకారం భారత ఆటగాళ్లు ఈపాటికే ఇండియాకు తిరిగి రావాల్సింది. కానీ.. బార్బడోస్‌లో భీకర తుఫాను పంజా విసరడంతో వాళ్లు అక్కడే చిక్కుకుపోయారు. కేవలం బార్బడోస్‌లోనే కాదు.. సెయింట్‌ లూసియా, గ్రెనడా, సెయింట్‌ విన్సెంట్, గ్రెనడైన్‌ దీవులపై కూడా ‘బెరిల్’ అనే హరికేన్ విలయతాండవం చేస్తోంది. ఈ తుఫాను కారణంగా ఆ ప్రాంతాలన్ని చెదిరిపోయాయి. ఈ దెబ్బకు.. ఎయిర్‌పోర్టు సహా ఇతర రవాణా మార్గాలను మూసివేయాల్సి వచ్చింది. అంతేకాదు.. అక్కడి అధికారులు కర్ఫ్యూ సైతం విధించారు. పరిస్థితులు మెరుగయ్యే వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. దీంతో.. భారత ఆటగాళ్లు బార్బడోస్‌లోని హోటల్ గదుల్లోనే ఉండిపోయారు. వీరి రాక మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.


ఘన సత్కారం

బార్బడోస్ నుంచి భారత ఆటగాళ్లు స్వదేశానికి వచ్చిన తర్వాత వారిని బీసీసీఐ ఘనంగా సత్కరించేందుకు సమాయత్తమవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ కార్యదర్శ జైషా తెలిపారు. హరికేన్ కారణంగా భారత జట్టు బార్బడోస్‌లో చిక్కుకుందని, అక్కడి నుంచి ఆటగాళ్లు బయలుదేరిన తర్వాత సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ఆయన రూ.125 కోట్ల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. తమ అంకితభావంతో ఆటగాళ్లు 1.4 బిలియన్ భారతీయుల కలను నెరవేర్చారని, రోహిత్ నాయకత్వంలో జట్టు అసాధారణమైన ప్రతిభను చూపెట్టిందని కొనియాడుతూ.. ఆ నజరానాని ప్రకటించారు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 01 , 2024 | 02:05 PM