Share News

Team India: స్టార్ క్రికెటర్లు వీఐపీ ట్రీట్మెంట్ మత్తు నుంచి బయటకు రావాలి: మాజీ క్రికెటర్

ABN , Publish Date - Nov 06 , 2024 | 01:38 PM

కోహ్లీ, రోహిత్ వంటి స్టార్ ప్లేయర్లు తమ ఫామ్‌ను మార్చుకోవాలంటే వీఐపీ సంస్కృతిని మరచిపోయి దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని కైఫ్ సూచించాడు.

Team India: స్టార్ క్రికెటర్లు వీఐపీ ట్రీట్మెంట్ మత్తు నుంచి బయటకు రావాలి: మాజీ క్రికెటర్
Virat Kohli Rohit Sharma

ముంబై: దేశీయ క్రికెట్‌ను నిర్లక్ష్యం చేయడంపై టీమిండియా ఆటగాళ్లు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ కు గురవుతున్నారు. క్రికెట్ అభిమానులతో పాటు మాజీ ఆటగాళ్లు సైతం స్టార్ క్రికెటర్లను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల న్యూజిలాండ్ చేతిలో 0-3 వైట్ వాష్ కు గురికావడం.. దేశీయ క్రికెట్ కు దూరంగా ఉండటమే కారణమనే వివాదం కొనసాగుతోంది.


మళ్లీ ఆ రోజులు రావాలి..

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి వారు మళ్లీ దులీప్ ట్రోఫీ వంటి దేశీయ క్రికెట్ కు తిరిగి రావాలని అది వారి కెరీర్ కు మంచిదని చాలా మంది ఇప్పటికీ భావిస్తున్నారు. వీరిద్దరూ ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో ఆడాలని కూడా ఫ్యాన్స్ సూచిస్తున్నారు. భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ కూడా ఇదే విషయాన్ని తెలిపాడు. అగ్రశ్రేణి తారలు తమ పెద్ద కార్లు, విమానాలు, వీఐపీ ట్రీట్‌మెంట్‌లను వదిలిపెట్టి దేశీయ క్రికెట్‌కు తిరిగి వెళ్లాలని సూచించారు. రంజీ ట్రోఫీలో, ఢిల్లీ, చండీగఢ్‌తో తలపడనుండగా, ముంబై రాబోయే మ్యాచ్‌లలో ఒడిషాకు ఆతిథ్యం ఇవ్వనుంది. భారత బృందం ఆస్ట్రేలియాకు వెళ్లడానికి మరింత సమయం ఉంది. దీంతో కొంతమంది ఆటగాళ్లను రంజీ ట్రోఫీకి అందుబాటులో ఉంచుకోవాలని కైఫ్ భావిస్తున్నాడు.


పంత్ ప్రదర్శన గుర్తుచేసుకోండి..

"ఖచ్చితంగా. వారికి ఫామ్ అవసరం, వారు అక్కడ గంటల తరబడి బ్యాటింగ్ చేయాలి. వంద పరుగులు చేయగలిగితు అది వారికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. మరింత కాన్ఫిడెంట్ గా ఆడటానికి ఉపయోగపడుతుంది" అని కైఫ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో తెలిపారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2020 సిరీస్ లో రిషబ్ పంత్ ప్రదర్శనను పంత్ గుర్తుచేశాడు. ఇక్కడ ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో జట్టులోకి వచ్చి భారత్ తరఫున చరిత్రను సృష్టించగలిగాడని కొనియాడాడు. "పంత్ గబ్బాలో గొప్ప గా ఆడాడు. మంచి పరుగులు రాబట్టాడు. కానీ ఆ పర్యటనలో అతను వన్డే లేదా టీ20 జట్టులో భాగం కాదు. అతను కేవలం టెస్ట్ సిరీస్ కోసం మాత్రమే వెళ్ళాడు. అక్కడ వృద్ధిమాన్ సాహా ముందు ఆడాడు . కానీ భారత్ ఆ మ్యాచ్‌లో ఓడిపోయింది. కానీ, ఆ టూర్‌లో పంత్ ఒక పింక్ బాల్ మ్యాచ్‌లో ఒక సెంచరీని సాధించాడు"అని అతను చెప్పాడు.


స్టార్ క్రికెటర్లు దిగి రావాలి..

కోహ్లీ, రోహిత్ వంటి స్టార్ ప్లేయర్లు తమ ఫామ్‌ను మార్చుకోవాలంటే వీఐపీ సంస్కృతిని మరచిపోయి దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని కైఫ్ సూచించాడు. "కాబట్టి ఎవరైనా పరుగులు తీయడానికి కష్టపడుతున్నారని తగినంత సమయం లభించలేదని అనుకుంటే, వారు దేశవాళీ క్రికెట్‌లో 100 శాతం ఆడాలి. మీరు పెద్ద కార్లు, విమానాలలో తిరగడం ఆపండి. అక్కడ లభించే వీఐపీ ట్రీట్ మెంట్ గురించి మర్చిపోండి ”అని అతను నొక్కి చెప్పాడు.

IPL Auction: ఐపీఎల్ వేలంలో పేర్లు నమోదు చేసుకున్న ఆటగాళ్ల లిస్ట్ ఇదే


Updated Date - Nov 06 , 2024 | 02:48 PM