Share News

IPL: ఐపీఎల్ చరిత్రలో ఫస్ట్ బౌలింగ్ చేసిన బౌలర్.. ఎదుర్కొన్న బ్యాట్స్‌మెన్ ఎవరంటే..

ABN , Publish Date - Oct 25 , 2024 | 07:27 AM

ఐపీఎల్ ప్రియులు ఎప్పుడెప్పుడు కొత్త సీజన్ మొదలవుతుందా అని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 17 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ టోర్నీ మరో సీజన్ కోసం సిద్ధమవుతోంది. అయితే ఐపీఎల్ మ్యాచుల్లో భాగంగా ఫస్ట్ బంతిని ఎవరు వేశారు? ఎవరు బ్యాటింగ్ ఎదుర్కొన్నారనే విషయాలను ఇక్కడ చుద్దాం.

IPL: ఐపీఎల్ చరిత్రలో ఫస్ట్ బౌలింగ్ చేసిన బౌలర్.. ఎదుర్కొన్న బ్యాట్స్‌మెన్ ఎవరంటే..
ipl updates

దేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొత్త సీజన్ 2025 ఐపీఎల్ వస్తున్న నేపథ్యంలో విదేశాలకు చెందిన అంతర్జాతీయ ఆటగాళ్లు కూడా ఈ లీగ్‌లో ఆడుతున్నారు. దీంతోపాటు ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉన్నారు 2008లో ప్రారంభమైన ఐపీఎల్ ఇప్పటి వరకు 17 సీజన్లను పూర్తి చేసుకుంది. కానీ ఈ లీగ్‌కి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఏటా పెరుగుతూనే ఉంది. అయితే మొదటి ఐపీఎల్ మ్యాచులో తొలి బంతిని ఎవరు వేశారు? ఎవరు ఎదుర్కొన్నారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.


ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్

ఐపీఎల్ మొదటి సీజన్ ఏప్రిల్ 18, 2008న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) vs కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరిగింది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించగా, కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. అందులో భాగంగా ఐపీఎల్ చరిత్రలో తొలి బంతిని ఆర్సీబీ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ప్రవీణ్ కుమార్(praveen kumar) వేయగా, కేకేఆర్ బ్యాట్స్ మెన్ సౌరభ్ గంగూలీ(sourav ganguly) తొలి బంతిని ఆడాడు.

ప్రవీణ్ కుమార్ వేసిన లెంగ్త్ బంతిని గంగూలీ డిఫెండ్ చేశాడు. ఈ విధంగా ఐపీఎల్‌లో తొలి బంతికే ప్రవీణ్‌కుమార్‌, తొలి బంతికే బ్యాటింగ్‌కు దిగిన ఆటగాడిగా గంగూలీ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో సౌరభ్ గంగూలీ 12 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.


ఫస్ట్ మ్యాచ్ ఎలా జరిగింది?

ఐపీఎల్ తొలి సీజన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ జట్టు రికార్డు స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్ విధ్వంసం సృష్టించి కేవలం 73 బంతుల్లో 158 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ కేవలం 82 పరుగులకే ఆలౌటైంది. దీంతో కేకేఆర్ 140 పరుగుల తేడాతో విజయం సాధించి ఐపీఎల్ చరిత్రలో మొదటి విజయాన్ని సాధించింది.


మరికొన్ని రోజుల్లో

ఇక మరికొన్ని రోజుల్లో మొదలు కానున్న ఐపీఎల్ 2025 సీజన్‌లో ఏ జట్టు గెలిచే ఛాన్స్ ఉంది. ఏ జట్లు ఫైనల్ వరకు చేరుకుంటాయనే విషయాలు తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. దీంతోపాటు ఆయా జట్లు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితా కొద్ది రోజుల్లో ఫైనల్ కానుంది. ఏ జట్టు ఎవరిని తీసుకుంటుందనేది తేలనుంది.


ఇవి కూడా చదవండి:

అదరగొట్టిన అమ్మాయిలు

Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Pension Plan: రోజూ రూ. 12 ఆదా చేస్తే.. 60 ఏళ్ల తర్వాత నెలకు ఎంత పెన్షన్ వస్తుందంటే..

Muhurat Trading 2024: ఈసారి దీపావళి ముహూరత్ ట్రేడింగ్ ఎప్పుడంటే.. అక్టోబర్ 31 లేదా నవంబర్ 1..

Personal Finance: మహిళలకు గుడ్ న్యూస్.. రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు..


Read More Sports News and Latest Telugu News

Updated Date - Oct 25 , 2024 | 07:29 AM