Share News

Womens T20 World Cup Final: రేపే ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. ఏ జట్టు గెలుస్తుందంటే..

ABN , Publish Date - Oct 19 , 2024 | 04:08 PM

మహిళల టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్ రేపు (అక్టోబర్ 20న) జరగనుంది. దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టు, న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టుతో తలపడనుంది. ఈ క్రమంలో రేపటి మ్యాచులో ఏ జట్టు గెలిచే ఛాన్స్ ఉందనే విషయాలను ఇప్పుడు చుద్దాం.

Womens T20 World Cup Final: రేపే ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. ఏ జట్టు గెలుస్తుందంటే..
Women's T20 World Cup Final match

మహిళల టీ20 ప్రపంచ కప్ 2024(Women's T20 World Cup 2024 Final) టోర్నీ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఇప్పుడు ఫైనల్లో టైటిల్ కోసం దక్షిణాఫ్రికా(south Africa), న్యూజిలాండ్(new zealand) జట్లు తలపడనున్నాయి. విశేషమేమిటంటే ఈ ట్రోఫీని ఇప్పటి వరకు ఈ రెండు జట్లూ కూడా గెలుచుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ట్రోఫీని ఏ జట్టు గెలుచుకున్నా కూడా చరిత్ర సృష్టిస్తుంది. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఇరు జట్లు కూడా మంచి ప్రదర్శన కనబరిచాయి. ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌లో భారత కాలమానం ప్రకారం రేపు రాత్రి 07:30 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.


ఈ జట్టుదే పైచేయి

న్యూజిలాండ్ మహిళల జట్టు, దక్షిణాఫ్రికా మహిళల జట్టు మధ్య ఇప్పటివరకు మొత్తం 16 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరగగా, వాటిలో దక్షిణాఫ్రికా నాలుగు గెలిచింది. న్యూజిలాండ్ 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక్క మ్యాచ్ ఫలితం తేలలేదు. ఈ గణాంకాలను పరిశీలిస్తే దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ జట్టుదే పైచేయి అనిపిస్తుంది.


రెండో ఫైనల్ మ్యాచ్

మహిళల టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టుకి ఇది మూడో ఫైనల్ మ్యాచ్. మహిళల టీ20 ప్రపంచకప్ (2009, 2010, 2024)లో ఈ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. దక్షిణాఫ్రికా జట్టుకు ఇది రెండో ఫైనల్ మ్యాచ్. మునుపటి ఎడిషన్‌లో కూడా జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే చివరకు ఆస్ట్రేలియా టైటిల్ గెలవాలనే కలను చెదరగొట్టింది. కానీ గూగుల్ గెలుపు అంచనా ప్రకారం చూస్తే మాత్రం దక్షిణాఫ్రికా జట్టుకు 60 శాతం గెలిచే ఛాన్స్ ఉండగా, న్యూజిలాండ్ జట్టుకు 40 శాతం ఉందని పేర్కొన్నారు. అయితే ఈ అంచనా ఏ మేరకు నిజమవుతుందో చూడాలి మరి.


మహిళల T20 ప్రపంచ కప్ 2024 కోసం రెండు జట్ల స్క్వాడ్‌లు:

న్యూజిలాండ్: సోఫీ డివైన్ (c), సుజీ బేట్స్, ఈడెన్ కార్సన్, ఇసాబెల్లా గేజ్ (WK), మాడీ గ్రీన్, బ్రూక్ హల్లిడే, ఫ్రాన్ జోనాస్, లీ కాస్పెరెక్, అమేలియా కెర్, జెస్ కెర్, రోజ్మేరీ మెయిర్, మోలీ పెన్ఫోల్డ్, జార్జియా ప్లిమ్మర్, హన్నా రోవ్ , లీ తహుహు.

దక్షిణాఫ్రికా: లారా వోల్వార్ట్ (కెప్టెన్), అన్నేకే బాష్, తజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, అన్నేలీస్ డెర్క్‌సెన్, మైకే డి రిడర్ (WK), అయాండా హ్లూబి, సినాలో జాఫ్తా (WK), మారిజాన్ కాప్, అయాబొంగా ఖాకా, సునే లూస్, నోంకులులే మలాబా, షేష్నీ నైడూ, తుమీ సెఖుఖునే, క్లో ట్రయాన్.


ఇవి కూడా చదవండి:

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి


Read More Sports News and Latest Telugu News

Updated Date - Oct 19 , 2024 | 04:10 PM