Share News

Paralympics 2024: పారాలింపిక్స్ ఐదో రోజు.. భారత్ ఖాతాలో 8వ పతకం..

ABN , Publish Date - Sep 02 , 2024 | 03:10 PM

పారాలింపిక్స్ 2024లో ఐదో రోజు డిస్కస్ త్రోలో యోగేష్ కథునియా(Yogesh Kathuniya) రజత పతకాన్ని గెలుచుకున్నాడు. పురుషుల డిస్కస్ త్రో F56 ఈవెంట్‌లో యోగేష్ రజత పతకాన్ని సాధించగా, దేశం మొత్తం పతకాల సంఖ్య 8కి చేరింది.

Paralympics 2024: పారాలింపిక్స్ ఐదో రోజు.. భారత్ ఖాతాలో 8వ పతకం..
Paralympics 2024 paris

పారిస్ పారాలింపిక్ గేమ్స్ 2024(Paralympics 2024)లో ఐదో రోజు భారత ఆటగాళ్లు మంచి ప్రదర్శన కొనసాగిస్తున్నారు. షూటింగ్, బ్యాడ్మింటన్ తర్వాత అథ్లెటిక్స్‌లో కూడా పతకాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పురుషుల డిస్కస్ త్రో ఎఫ్-56 విభాగంలో భారత్‌కు చెందిన యోగేష్ కథునియా(Yogesh Kathuniya) రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ 8వ పతకాన్ని కైవసం చేసుకుంది.


రెండో సారి

ఇది మాత్రమే కాదు యోగేష్ వరుసగా రెండవ పారాలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించడం విశేషం. అంతకుముందు టోక్యో గేమ్స్‌లో కూడా ఇదే పతకం సాధించాడు. పురుషుల డిస్కస్ త్రో F56 ఫైనల్లో ఐదు త్రోల తర్వాత భారతదేశానికి చెందిన యోగేష్ కథునియా రెండవ స్థానంలో నిలిచాడు. అతని అత్యుత్తమ త్రో 42.22 మీటర్లు


ఫస్ట్ త్రో

పారిస్‌లోని స్టేడ్ డి ఫ్రాన్స్‌లో జరుగుతున్న పారాలింపిక్స్ అథ్లెటిక్స్ ఈవెంట్‌లో భారత్ ఈ పతకాన్ని గెలుచుకుంది. నేడు జరిగిన ఎఫ్ 56 కేటగిరీ డిస్కస్ త్రో ఈవెంట్‌లో యోగేష్ 44.22 మీటర్లు విసిరి పతకం సాధించాడు. విశేషమేమిటంటే యోగేష్ తన మొదటి ప్రయత్నంలోనే ఈ త్రో చేసాడు. అది అతనికి పతకం సాధించడానికి సరిపోయింది. అయినప్పటికీ తర్వాత వేసిన త్రోలు మాత్రం తక్కువగా వచ్చాయి. దీంతో మొదటి త్రోను ఫైనల్ చేశారు.

  • మొదటి త్రో- 42.22

  • రెండో త్రో- 41.50

  • మూడో త్రో- 41.55

  • నాలుగో త్రో- 40.33

  • ఐదవ త్రో- 40.89


మరో కాంస్యం

మరోవైపు బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ డబుల్స్ SH6 కాంస్య పతక పోరులో భారత జంట శివరాజన్ సోలైమలై/నిత్య సుమతి శివన్‌లు ఓటమిని చవిచుశారు. ఇండోనేషియాకు చెందిన సుభాన్‌/రీనా మార్లినాతో జరిగిన మ్యాచ్‌లో భారత జోడీ 21-17, 21-12తో ఓడిపోయింది. సోమవారం జరుగుతున్న పారిస్ పారాలింపిక్స్ 2024లో మహిళల సింగిల్స్ SU5 ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా పారా షట్లర్ తులసిమతి మురుగేశన్ భారత్‌కు మరో పతకాన్ని ఖాయం చేసింది. మురుగేశన్ 23-21, 21-17తో తన దేశానికి చెందిన మనీషా రామదాస్‌ను ఓడించి కేవలం 40 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది. ఈ ఓటమి తర్వాత రాందాస్ ఇప్పుడు కాంస్య పతకం కోసం పోటీపడనుంది.


ఇవి కూడా చదవండి..

నిషద్‌కు రజతం

Sheetal Devi: అబ్బురపరిచిన పారా ఆర్చర్ శీతల్ దేవి.. కాలితోనే విల్లు ఎత్తి సూపర్ షాట్..


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 02 , 2024 | 03:22 PM