OTT Apps Ban: 18 ఓటీటీ యాప్స్‌పై నిషేధం.. ఈ లిస్ట్ చుశారా..
ABN , Publish Date - Dec 22 , 2024 | 05:46 PM
అసభ్యకరమైన కంటెంట్‌లను ప్రమోట్ చేయడం వల్ల భారత ప్రభుత్వం 18 ఓటీటీ యాప్‌లను నిషేధించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ ముర్గాన్ ఇటివల పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా వెల్లడించారు.
అశ్లీల కంటెంట్, అసభ్యకరమైన వీడియోలతో ఉన్న OTT ప్లాట్‌ఫారమ్‌లపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో అలాంటి 18 OTT యాప్‌లను ప్రభుత్వం బ్లాక్ చేసింది. డిజిటల్ మీడియాను నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. కొత్త IT రూల్స్ 2021 ప్రకారం అసభ్యకరమైన కంటెంట్‌ను అందించే యాప్‌లపై ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. అంతేకాదు భారతీయ వినియోగదారుల డేటాను సురక్షితంగా ఉంచడానికి అనేక యాప్‌లను బ్లాక్ చేయాలని కూడా నిర్ణయించింది.
ఈ యాప్‌లు రద్దు
కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ ముర్గాన్ ఇటీవల పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఈ మేరకు తెలిపారు. ఈ యాప్‌లన్నింటి ద్వారా అశ్లీల కంటెంట్ అందించబడుతోందన్నారు. IT చట్టంలోని సెక్షన్ 69A ప్రకారం ఈ యాప్‌లు రద్దు చేయబడ్డాయి. రద్దు చేసిన యాప్‌లలో ఏవేవి ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
Dreams Films
Voovi
Yessma
Uncut Adda
Tri Flicks
X Prime
Neon X VIP
Besharams
Hunters
Rabbit
Xtramood
Nuefliks
MoodX
Mojflix
Hot Shots VIP
Fugi
Chikooflix
Prime Play
కేసు నమోదు
దీంతోపాటు అసభ్యకరమైన కంటెంట్‌ను అందించినందుకు IPC సెక్షన్ 292 కింద ఆయా యాప్‌ల యజమానులపై కేసు నమోదు చేయబడింది. ఇది మాత్రమే కాదు, మహిళల అసభ్య ప్రాతినిధ్యం చట్టం 1986లోని సెక్షన్ 4 ప్రకారం ఈ యాప్‌లను బ్లాక్ చేయాలని కూడా ఆర్డర్ జారీ చేశారు. వీటిలో చాలా యాప్‌లు కోటి కంటే ఎక్కువ డౌన్‌లోడ్‌లను కలిగి ఉండటం విశేషం. Facebook, WhatsApp, X, YouTube వంటి ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి అశ్లీల కంటెంట్ ట్రైలర్‌లు, క్లిప్‌లను వీరు ప్రచారం చేయడానికి ఉపయోగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Cyber Protection: సైబర్ మోసాల నుంచి మీ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఇలా రక్షించుకోండి..
Public Holidays: 2025లో పబ్లిక్ హాలిడేస్ ఎన్ని రోజులో తెలుసా..
Next Week IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని కంపెనీలంటే..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..
Choti Choti Savings: ఈ చిన్నారి పొదుపును చూస్తే షాక్ అవుతారు.. వైరల్ వీడియో
Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..
Read More Business News and Latest Telugu News