Share News

ChatGPT: చాట్‌జీపీటీ వినియోగదారులకు షాకింగ్ న్యూస్

ABN , Publish Date - Oct 02 , 2024 | 02:38 PM

ChatGPTకి క్రమంగా ప్రజాదరణ నిరంతరం పెరుగుతోంది. ఈ క్రమంలోనే దీనికి అలవాటైన కస్టమర్లకు షాకింగ్ న్యూస్ వచ్చింది. త్వరలోనే ఏఐ ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌ను ధరలను భారీగా పెంచనున్నట్లు తెలుస్తోంది.

ChatGPT: చాట్‌జీపీటీ వినియోగదారులకు షాకింగ్ న్యూస్
ChatGPT Plus plan

గత కొద్ది రోజులుగా చాట్‌జీపీటీ వినియోగానికి అలవాటు పడిన కస్టమర్లకు షాకింగ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే OpenAI ChatGPT ప్లస్ ధరలను పెంచాలని నిర్ణయించింది. ఈ క్రమంలో వచ్చే ఐదేళ్లలో సబ్‌స్క్రిప్షన్ ధరను రెండింతలు పెంచాలని కంపెనీ యోచిస్తోంది. దీనికి కారణంగా ChatGPT వంటి AI సేవను అమలు చేసేందుకు పెరుగుతున్న ఖర్చు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో కంపెనీ తన ఆదాయాన్ని పెంచుకోవడం కోసం AI మోడల్‌లను మెరుగుపరచుకోవడానికి కృషి చేస్తోంది.


క్షీణిస్తోన్న ఆర్థిక పరిస్థితి

అయితే ధరల పెరుగుదల కారణంగా, కొంతమంది వినియోగదారులు ఈ సేవలను ఉపయోగించే విషయంలో వెనక్కి తగ్గే ఛాన్స్ ఉంది. ప్రస్తుత సంవత్సరం OpenAI దాదాపు 5 బిలియన్ డాలర్ల నష్టాన్ని పొందుతుందని భావిస్తున్నారు. కంపెనీ తన ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి కొత్త నిధులను పొందే ప్రక్రియలో ఉంది. ఇది కాకుండా సంస్థ అధికారిక ఖాతా ఇటీవల హ్యాక్ చేయబడింది. ఈ నివేదిక ప్రకారం కంపెనీ నెలవారీ సభ్యత్వాన్ని 2 డాలర్లకు పెంచాలని చూస్తోంది. ఇది భారతదేశంలో దాదాపు రూ. 167కి లభించనుంది.


ఎప్పటివరకు ధరలు పెంచవచ్చు?

OpenAI ఫిబ్రవరిలో నెలకు $20 (సుమారు రూ. 1,677) చొప్పున ChatGPT ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌ని ప్రారంభించింది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం AI సంస్థ 2024 చివరి నాటికి ధరలను పెంచవచ్చు. 2029 చివరి నాటికి ChatGPT ప్లస్ సబ్‌స్క్రిప్షన్ నెలకు $44కి పెరగవచ్చని నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో ఓపెన్‌ఏఐ సబ్‌స్క్రిప్షన్ ధరను $44కి అంటే సుమారు రూ. 3,690కి వచ్చే 5 సంవత్సరాల్లో పెంచుతుందని భావిస్తున్నారు.


మిలియన్ల మంది యూజర్లు

OpenAI ప్రస్తుతం ChatGPT ప్లస్ 10 మిలియన్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో ఓపెన్ ఏఐ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ధరలు పెరిగితే కంపెనీ చాలా లాభాన్ని పొందుతుందని భావిస్తున్నారు. ChatGPTకి పెరుగుతున్న ప్రజాదరణతో దీని డిమాండ్ కూడా నిరంతరం పెరుగుతోంది. దీంతో ధరలను పెంచినప్పటికీ దీనికి అలవాటైన యూజర్లు పెంచిన రేట్లను చెల్లించే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ క్రమంలో కంపెనీ సరఫరాను నియంత్రించడానికి ప్రయత్నించవచ్చని అంటున్నారు. మరికొంత మంది మాత్రం రేట్లు పెరిగినందున ప్రత్యామ్నాయ ఏఐలకు అనేక మంది యూజర్లు మారే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ ధరలు ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

WhatsApp Hacking: మీ వాట్సాప్ ఖాతా హ్యాకైందో లేదో ఇలా తెలుసుకోండి..

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం.

Business Idea: ఈ వ్యాపారం ఎవర్ గ్రీన్.. రూ.50 వేల పెట్టుబడి, 11 లక్షలకుపైగా లాభం..

For More Technology News and Telugu News

Updated Date - Oct 02 , 2024 | 02:43 PM