Smart Phone Tips: మీ మొబైల్ విషయంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి..
ABN , Publish Date - Nov 13 , 2024 | 06:22 PM
మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను సరిగ్గా వినియోగిస్తున్నారా. మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మీ స్మార్ట్‌ఫోన్ త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. అయితే ఎలాంటి తప్పులు చేయకుంటే స్మార్ట్‌ఫోన్ ఎక్కువ కాలం ఉంటుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రస్తుత రోజుల్లో పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌లు(Smart Phone) ఉన్నాయి. దీంతో ఈ పరికరం మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఫోన్ ద్వారానే చాలా పనులు నిమిషాల్లోనే అయిపోతున్నాయి. షాపింగ్ చేయాలన్నా లేదా ఎవరికైనా డబ్బు పంపాలనుకున్నా సులభంగా చేస్తున్నారు. ఫోన్ ద్వారా లైవ్ టీవీ, కాలింగ్, SMSతో సహా అనేక పనులను చేసుకుంటున్నారు. అయితే మీరు చేసే కొన్ని పొరపాట్ల వల్ల మీరు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. అవి ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పొరపాటున కూడా ఈ పనులు చేయకండి
అనేక మంది ప్రజలు రీల్స్ కోసం తమ ఫోన్లను నీటిలో ఉంచుతున్నారు. ఇంకొంత మంది మాత్రం తమ ఫోన్ వాటర్‌ప్రూఫ్ అని భావించి స్విమ్మింగ్ పూల్‌లోకి వెళ్లి నీటి అడుగున సెల్ఫీలు, వీడియోలను రికార్డ్ చేస్తున్నారు. ఇలాంటి పొరపాట్ల వల్ల మీ ఫోన్‌కు చాలా నష్టం జరుగుతుంది. స్మార్ట్‌ఫోన్‌ను నీటిలోకి తీసుకెళ్లడం చాలా ప్రమాదకరం. అలా చేయడం ద్వారా స్క్రీన్ మదర్‌బోర్డ్‌తో సహా అనేక భాగాలు తీవ్రంగా దెబ్బతింటాయి. మీ పరికరం IP68 లేదా IP69 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌తో వచ్చినప్పటికీ దీన్ని చేయోద్దని నిపుణులు చెబుతున్నారు.
ఫోన్‌ను ఛార్జ్ చేయడం
మరి కొంతమంది మాత్రం ఫోన్ బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అయ్యే వరకు వాడుతూనే ఉంటారు. అయితే అలా చేయడం వల్ల మీ ఫోన్ తక్కువ కాలంలోనే పాడైపోతుందని నిపుణులు అంటున్నారు. స్మార్ట్‌ఫోన్ల తయారీదారు ఆపిల్ మీ పరికరం బ్యాటరీని 20% కంటే తక్కువ ఉంటే ఉపయోగించకూడదని చెబుతుంది. అంతేకాదు మీరు ప్రతిరోజూ బ్యాటరీని పూర్తిగా ఫుల్ ఛార్జ్ చేసినా కూడా మీ ఫోన్ బ్యాటరీ త్వరగా పాడైపోతుందని నిపుణులు చెబుతున్నారు.
చౌక ఫోన్ కవర్లు
కొంతమంది డబ్బును ఆదా చేయడానికి తక్కువ నాణ్యత గల టెంపర్డ్ గ్లాస్‌ని తీసుకుంటారు. అలా చేయడం వల్ల మీ ఫోన్ ఎక్కువ దూరం నుంచి కింద పడితే ఆ టెంపర్డ్ గ్లాసెస్ మీ ఫోన్‌ను రక్షించవు. దీని కారణంగా మీ ఫోన్ టచ్ స్క్రీన్ దెబ్బతీనే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఫోన్ కోసం మంచి టెంపర్డ్ గ్లాసెస్ ఉపయోగించండి.
ఛార్జింగ్ పోర్ట్
మీరు మీ ఫోన్ ఛార్జింగ్ చేసే విషయంలో కూడా కొన్ని విషయాలు గమనించాలి. ఛార్జింగ్ చేసే క్రమంలో నెమ్మదిగా ఛార్జ్ అయితే పోర్ట్ లేదా కేబుల్‌ను పరిశీలించాలి. దీంతోపాటు దానిలో ఏదైనా చెత్తాచెదారం చిక్కుకుపోయిందా అని చూడాలి. స్లో ఛార్జింగ్ వల్ల ఫోన్ పాడయ్యే అవకాశం ఉంది. ఏదైనా ఉంటే దానిని తొలగించడానికి మృదువైన టూత్ బ్రష్ ఉపయోగించండి. మీ ఫోన్ అప్పటికీ ఛార్జ్ కాకపోతే మీ ఫోన్‌ని రీబూట్ చేయడానికి ప్రయత్నించండి.
ఇవి కూడా చదవండి:
Spam Calls: స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఒక్క సెట్టింగ్ చేస్తే చాలు.. స్పామ్ కాల్స్ నుంచి రిలీఫ్...
WhatsApp Hacking: మీ వాట్సాప్ ఖాతా హ్యాకైందో లేదో ఇలా తెలుసుకోండి..
Business Idea: ఈ వ్యాపారం ఎవర్ గ్రీన్.. రూ.50 వేల పెట్టుబడి, 11 లక్షలకుపైగా లాభం..
For More Technology News and Telugu News