Share News

Spam Calls: స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఒక్క సెట్టింగ్‌ చేస్తే చాలు.. స్పామ్ కాల్స్ నుంచి రిలీఫ్...

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:03 AM

దేశంలో కోట్లాది మంది మొబైల్ ఫోన్ వినియోగదారులు ప్రతిరోజు వస్తున్న స్పామ్ కాల్స్‌తో ఇబ్బంది పడుతున్నారు. చాలా సార్లు ఈ ఫేక్ కాల్స్ వల్ల అనేక మంది భారీగా నష్టపోవాల్సి వస్తుంది. అయితే మీ స్మార్ట్ ఫోన్‌లోని కొన్ని సెట్టింగ్‌లను మార్చుకుంటే ఈ స్పామ్ కాల్స్ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. అది ఎలా అనేది ఇక్కడ చుద్దాం.

Spam Calls: స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఒక్క సెట్టింగ్‌ చేస్తే చాలు.. స్పామ్ కాల్స్ నుంచి రిలీఫ్...
stop spam calls

ఇటివల కాలంలో అనేక మంది స్పామ్ కాల్స్‌(spam calls) సమస్యతో చికాకు పడుతున్నారు. ముఖ్యమైన పనుల్లో బిజీగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా స్పామ్ కాల్స్ రావడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ క్రమంలో స్పామ్ కాల్స్ రోజుకు నాలుగైదు రావడంతో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కాల్స్ వస్తున్న వాటిలో ప్రధానంగా లోన్ ఆఫర్స్, క్రెడిట్ కార్డ్, ఈఎంఐ, కార్, హామ్ లోన్ సహా అనేక అంశాలకు సంబంధించినవి ఉంటున్నాయి. ఈ స్పామ్ కాల్‌లను నివారించడానికి వినియోగదారులు DND మోడ్‌ని ఉపయోగించవచ్చు. కానీ DND మోడ్‌ని ఎక్కువ కాలం ఆన్‌లో ఉంచలేరు.


ఈ సెట్టింగ్స్

దీని కోసం మీరు ముందుగా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని సెట్టింగ్స్‌కు వెళ్లాలి. అక్కడ కాల్ సెట్టింగ్స్ లేకుంటే సెర్చ్‌లో కాల్ సెట్టింగ్స్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. అప్పుడు వచ్చిన కాల్ సెట్టింగ్స్ ఆప్షన్ ఎంచుకుంటే దానిలో కాలర్ ఐడీ అండ్ స్పామ్ ప్రొటెక్షన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఎంపిక ఆఫ్‌లో ఉంటే మీరు దానిని ఆన్ చేయాలి. దీని తర్వాత మీరు స్పామ్ కాల్స్ సమస్య నుంచి రక్షించబడతారు. ఈ సెట్టింగ్‌ను మార్చిన తర్వాత అప్పటివరకు ఉన్న స్పామ్ కాల్‌లు స్వయంచాలకంగా బ్లాక్ చేయబడతాయి. కానీ అప్పటికే స్పామ్‌గా గుర్తించబడని ఫోన్ నంబర్లు మాత్రం బ్లాక్ చేయబడవు.

spam calls.JPG


థర్డ్ పార్టీ యాప్ నుంచి

ఈ సెట్టింగ్ ఆన్ చేసిన తర్వాత పలు సందర్భాలలో ఇతర నంబర్ల నుంచి కాల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ గతంలో కంటే స్పామ్ కాల్స్ మాత్రం తగ్గుతాయని చెప్పవచ్చు. మరోవైపు ఇటివల టెలికాం నియంత్రణ సంస్థ TRAI కూడా ఫేక్ కాల్స్‌ను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని టెలికాం కంపెనీలను కోరింది. మరోవైపు థర్డ్ పార్టీ కాలర్ ఐడి యాప్ ట్రూకాలర్ వినియోగదారుల ఫోన్‌లలో నకిలీ కాల్‌లను నిరోధించడానికి AI ఫిల్టర్‌లను రూపొందించింది. ట్రూ కాలర్ ఈ ఫీచర్‌ను భారతీయ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది.


దీన్ని గుర్తుంచుకోండి

మీరు ఈ ఫీచర్‌ని ఆన్ చేస్తే మీరు ఎలాంటి ఆన్‌లైన్ డెలివరీని (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ, జొమాటో మొదలైనవి) తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొవచ్చు. ఎందుకంటే డెలివరీ బాయ్‌ల నంబర్‌లు మీ ఫోన్‌లో సేవ్ కానందున, వారు మీకు కాల్ చేయలేకపోవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఫీచర్‌ని ఆన్ చేసిన తర్వాత ఇతర వ్యక్తులు స్పామ్‌గా నివేదించిన అన్ని స్పామ్ కాల్స్ నుంచి మీరు దూరంగా ఉంటారు. అయితే పలు కంపెనీలు మాత్రం ఇంకా స్పామ్ లేదా స్కామ్‌గా గుర్తించబడని నంబర్‌ను ఉపయోగిస్తే, మీకు వారి నుంచి కాల్స్ వచ్చే ఛాన్స్ ఉంది.


ఇవి కూడా చదవండి:

WhatsApp Hacking: మీ వాట్సాప్ ఖాతా హ్యాకైందో లేదో ఇలా తెలుసుకోండి..

Gmail Scam: జీమెయిల్ ఖాతా రికవరీ చేస్తామంటూ కేటుగాళ్ల స్కాం


Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Business Idea: ఈ వ్యాపారం ఎవర్ గ్రీన్.. రూ.50 వేల పెట్టుబడి, 11 లక్షలకుపైగా లాభం..

For More Technology News and Telugu News

Updated Date - Oct 25 , 2024 | 11:05 AM