Share News

Google India 2024: గుడ్ న్యూస్ చెప్పనున్న గూగుల్.. స్పెషల్ ఏంటంటే..

ABN , Publish Date - Sep 30 , 2024 | 09:31 PM

టెక్ ప్రియులకు గుడ్ న్యూస్. గూగుల్ తన వార్షిక ‘గూగుల్ ఫర్ ఇండియా 2024’ ఈవెంట్‌ను అక్టోబర్ 3న నిర్వహించబోతోంది. ఈ నేపథ్యంలో కంపెనీ Android, AI, Google అసిస్టెంట్ సహా కీలక సేవల గురించి ప్రకటనలు చేసే అవకాశం ఉంది.

Google India 2024: గుడ్ న్యూస్ చెప్పనున్న గూగుల్.. స్పెషల్ ఏంటంటే..
Google India event October 3rd

గూగుల్ భారతీయుల(google) కోసం కీలక ప్రకటనలు చేయనుంది. ఎందుకంటే గూగుల్ ఫర్ ఇండియా 2024(google for india 2024) వార్షిక ఈవెంట్‌ను అక్టోబర్ 3న నిర్వహించబోతోంది. విశేషమేమిటంటే భారతీయుల కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ Android, AI, Google అసిస్టెంట్ సహా పలు ప్రత్యేక సేవలను ప్రారంభించడం గురించి ప్రకటనలు చేసే ఛాన్స్ ఉంది. ఈ ఈవెంట్ మొదట 2015లో ప్రారంభించబడింది. అప్పటి నుంచి కంపెనీ ఈ ఈవెంట్‌లో ప్రతి ఏటా కొత్త ఉత్పత్తులు, సేవలు, దాని భవిష్యత్తు ప్రణాళికల గురించి తెలియజేస్తుంది.


గతేడాది ఏం జరిగింది?

గత సంవత్సరం గూగుల్ AI, స్మాల్ బిజినెస్, Google Pay, మేక్ ఇన్ ఇండియా వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించింది. భారతదేశంలో పిక్సెల్ ఫోన్‌లను తయారు చేయాలని కంపెనీ ప్లాన్ చేసింది. ఆ తర్వాత AI ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాల గురించి సమాచారాన్ని అందించేందుకు సిద్ధమైంది.


ఈ సంవత్సరం స్పెషల్

ముఖ్యంగా స్థానిక భాషలు, చిన్న వ్యాపారాల కోసం Google AI నుంచి ప్రకటనలు రావచ్చు. Google Pay ద్వారా క్రెడిట్ తీసుకునే సదుపాయం మరింత మెరుగ్గా ఉండే ఛాన్స్ ఉంది. విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం వంటి విభాగాల్లో ప్రకటనలను ఆశించవచ్చు. గతంలో Google ప్రభుత్వ సేవలను ఉపయోగించే వినియోగదారులకు సహాయపడే యాప్‌లను ప్రారంభించేందుకు యాక్సిస్ మై ఇండియాతో కలిసి పనిచేసింది. కాబట్టి ఇదే తరహాలో మరికొన్ని పరిణామాలను ఆశించవచ్చు. దీంతోపాటు ఆన్‌లైన్ మోసం, తప్పుడు సమాచారాన్ని కట్టడి చేసేందుకు టెక్ దిగ్గజం DigiKavachని కూడా పరిచయం చేసింది. పెరుగుతున్న డిజిటల్ భద్రతా ఆందోళనల మధ్య మరిన్ని కీలక ప్రకటనలు చేసే ఛాన్స్ ఉంది.


ఈవెంట్ తేదీ

ఈ క్రమంలోనే గూగుల్ తనదైన శైలిలో గూగుల్ ఫర్ ఇండియా 2024 ఈవెంట్ తేదీని కూడా షేర్ చేసింది. వాస్తవానికి కంపెనీ బైనరీ లాంగ్వేజ్‌లో ట్వీట్ చేసింది. ఇది డీకోడ్ చేసినప్పుడు, ఇండియా ఈవెంట్ Google తేదీని చూపిస్తుంది. వినియోగదారులు కూడా తక్కువేమీ కాదు. ఈ పోస్ట్‌కు ప్రతిస్పందనగా ఒక వినియోగదారు కూడా బైనరీ భాషలో ట్వీట్ చేసి, మేము కూడా ఈ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నామని చెప్పాడు.


ఎందుకు ప్రత్యేకం

భారత్‌కు గూగుల్ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఈ ఈవెంట్ తెలియజేస్తోందని చెప్పవచ్చు. ఎందుకంటే గూగుల్ ఉత్పత్తులు, సేవలు భారతదేశంలోని మిలియన్ల మంది ప్రజలు ఉపయోగిస్తున్నారు. దీంతోపాటు గూగుల్ వ్యాపారం కూడా భారత్‌లో క్రమంగా పుంజుకుంటుంది. ఈ ఈవెంట్‌లో ఏమి ప్రకటిస్తుందో గూగుల్ ఇంకా అధికారికంగా మాత్రం చెప్పలేదు.


ఇవి కూడా చదవండి:

WhatsApp Hacking: మీ వాట్సాప్ ఖాతా హ్యాకైందో లేదో ఇలా తెలుసుకోండి..

PM E DRIVE: ఈవీలు కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్.. రేపటి నుంచి రూ. 50 వేల వరకు తగ్గింపు

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం.

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Business Idea: ఈ వ్యాపారం ఎవర్ గ్రీన్.. రూ.50 వేల పెట్టుబడి, 11 లక్షలకుపైగా లాభం..

For More Technology News and Telugu News

Updated Date - Sep 30 , 2024 | 09:34 PM