WhatsApp Poll: వాట్సాప్ పోల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసా.. స్టెప్ బై స్టెప్
ABN , Publish Date - Dec 15 , 2024 | 06:10 PM
వాట్సాప్‌లో మీకు పోల్ ఫీచర్ గురించి తెలుసా. లేదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫీచర్ ద్వారా ఎక్కువ మంది ఉన్న గ్రూపులలో పోల్ క్రియేట్ చేయడం ద్వారా ఆయా సభ్యుల అభిప్రాయాలను సులభంగా తెలుసుకోవచ్చు. దీనిని ఎలా క్రియేట్ చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం.
వాట్సాప్‌ను ప్రస్తుతం భారతదేశంలో మిలియన్ల మంది ప్రజలు ఉపయోగిస్తున్నారు. ఇది వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించే అనేక ఫీచర్లను అందిస్తోంది. అందులో భాగంగానే వాట్సాప్‌లో పోల్స్ అనే ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా ఓటు విధానం ద్వారా పోల్‌లను సృష్టించుకోవచ్చు. పోల్ ఫలితాలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం ద్వారా యూజర్లు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్‌లను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసుకుందాం.
పోల్ ఎలా
పోల్ కోసం మీరు తప్పనిసరిగా యాక్టివ్ WhatsApp ఖాతాను ఉపయోగించాలి. ఒకే ఓటు పోల్‌ను వినియోగదారులు ఒక్కసారి మాత్రమే ఓటు వేయడం ద్వారా ఖచ్చితమైన సమాధానాన్ని పొందడానికి అనుమతిస్తాయి. దీని కోసం మీరు ఏదైనా చాట్ విండో లేదా గ్రూప్ చాట్‌కి వెళ్లి, అటాచ్‌మెంట్ చిహ్నంపై నొక్కండి. అక్కడ మీకు పోల్స్ ఎంపిక కనిపిస్తుంది. దానిని క్లిక్ చేసి పోల్‌ను ఎంచుకోండి. ఆ తర్వాచ ఒకే-ఓటు పోల్‌ను రూపొందించడానికి పలు రకాల ప్రశ్నలను మీరు తీసుకుని సృష్టించుకోవచ్చు.
పోల్‌ను ఎలా సృష్టించాలి
మీ మొబైల్ పరికరంలో వ్యక్తిగత చాట్‌ని తెరవండి
ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అటాచ్ బటన్‌పై నొక్కండి
దాని నుంచి పోల్ చిహ్నాన్ని ఎంచుకోండి, పోల్ సృష్టించబడుతుంది
ఇప్పుడు మీరు అడగాలనుకుంటున్న ప్రశ్నను ASKపై ఎంపిక చేసి ఇవ్వండి
తర్వాత యాడ్ బటన్‌ను నొక్కడం ద్వారా పోల్ ఎంపికను నమోదు చేయవచ్చు
పోల్ ఎంపికల క్రమాన్ని మార్చడానికి 'హంబర్గర్' చిహ్నాన్ని ఎంచుకుని, లాగండి
చివరగా మీ పోల్‌ని సృష్టించడానికి సెండ్ బటన్ నొక్కండి
మీరు ఓటు వేయాలనుకుంటున్న ఎంపికలను ఎంచుకుని వాటిపై క్లిక్ చేయండి
మీరు మీ ఓటును తీసివేయడానికి మరొకసారి కూడా క్లిక్ చేయవచ్చు
మీరు మీ ఓటును మార్చుకోవడానికి అందుబాటులో ఉన్న ఇతర పోల్ ఆప్షన్‌లను ట్యాప్ చేయవచ్చు
మీరు పోల్ జరిగిన చాట్‌ను ఓపెన్ చేయవచ్చు, తర్వాత వ్యూ వోట్స్ ఆప్షన్‌పై ట్యాప్ చేయడం ద్వారా మీ ఓటును చూసుకోవచ్చు.
పోల్ ఫిల్టర్
ఈ ఫీచర్ ఇప్పుడు ఫోటోలు, వీడియోలు లేదా లింక్‌ల మాదిరిగానే సెర్చ్‌లో పోల్‌లను ఫిల్టర్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ రెండు కాకుండా మూడవ ఫీచర్ కూడా ఉంది. వినియోగదారులు సృష్టించిన పోల్‌లపై ఓటు వేసినప్పుడు వినియోగదారులు నోటిఫికేషన్‌లను స్వీకరిస్తారు. ఈ దశలను అనుసరించడం ద్వారా మీరు WhatsAppలో మెరుగైన పోల్ ఫీచర్ ప్రయోజనాన్ని పొందవచ్చు. మీరు చేయాల్సిందల్లా మీ WhatsApp యాప్ తాజా వెర్షన్‌కి అప్‌డేట్ చేసి, పైన పేర్కొన్న దశలను అనుసరించడం ప్రారంభించండి.
ఇవి కూడా చదవండి:
WhatsApp Hacking: మీ వాట్సాప్ ఖాతా హ్యాకైందో లేదో ఇలా తెలుసుకోండి..
Smart Phone Tips: మీ మొబైల్ విషయంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి..
Apple iPhone: ఫోన్ల చోరీ నుంచి రక్షణ కోసం క్రేజీ ఫీచర్.. వీటిలో మాత్రమే..
Spam Calls: స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఒక్క సెట్టింగ్ చేస్తే చాలు.. స్పామ్ కాల్స్ నుంచి రిలీఫ్...
For More Technology News and Telugu News