Share News

Jio New App: జియో నుంచి మరో కొత్త యాప్.. వివరాలు ఇవే..

ABN , Publish Date - Oct 12 , 2024 | 10:03 PM

జియో(Jio) సంస్థ అక్టోబర్ 11న మరో కొత్త యాప్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే జియో సంస్థ అనేక రకాల యాప్‌లు అందిస్తోంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ యాప్‌లతోపాటు తాజాగా జియో ఫైనాన్స్‌ యాప్‌(Jio Finance App)ను వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది.

Jio New App: జియో నుంచి మరో కొత్త యాప్.. వివరాలు ఇవే..

ఇంటర్నెట్ డెస్క్: జియో(Jio) సంస్థ అక్టోబర్ 11న మరో కొత్త యాప్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే జియో సంస్థ అనేక రకాల యాప్‌లు అందిస్తోంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ యాప్‌లతోపాటు తాజాగా జియో ఫైనాన్స్‌ యాప్‌ (Jio Finance App)ను వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. దీన్ని జియో ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్ రూపొందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ యాప్‌ ద్వారా యూపీఐ చెల్లింపుల సహా అనేక రకాల ఫీచర్లు అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. గూగుల్ ప్లేస్టోర్‌, ఆపిల్ స్టోర్‌‌లో జియో ఫైనాన్స్ యాప్‌ అందుబాటులో ఉందని తెలిపారు. దీనికి సంబంధించిన బీటా వెర్షన్ మే నెలలోనే లాంచ్ చేసినట్లు చెప్పారు. మై జియో యాప్‌లోనూ ఫైనాన్స్ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.


జియో ఫైనాన్స్‌ యాప్‌‌లో కేవలం ఐదు నిమిషాల్లోనే జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఉందని జియో సంస్థ ప్రతినిధులు తెలిపారు. కేవలం మూడు స్టెపుల్లోనే ఖాతా తెరవచ్చని చెప్పారు. దీని ద్వారా బ్యాకింగ్ సేవలు మరింత సులభతరం అవుతాయని వెల్లడించారు. అకౌంట్ ప్రక్రియ మెుత్తం ఐదు నిమిషాల్లోనే పూర్తవడం యాప్ ప్రత్యేకత అని చెప్పుకొచ్చారు. ఖాతా తెరిచిన తర్వాత IMPS లేదా NEFT ద్వారా నగదు లావాదేవీలు చేయెుచ్చని చెప్పారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ యాప్‌లో చేసే ప్రతి రీఛార్జ్‌‌పైనా రివార్డులు అందించనున్నట్లు జియో సంస్థ ప్రతినిధులు తెలిపారు. అలాగే ఈ యాప్‌‌కు బ్యాంకు ఖాతాలను సులభంగా లింక్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. యాప్ ద్వారా UPI, డిజిటల్‌ బ్యాంకింగ్, ఫాస్ట్ ట్యాగ్, డీటీహెచ్ రీఛార్జ్‌, మొబైల్‌ రీఛార్జ్‌, క్రెడిట్‌ కార్డు పేమెంట్‌, ఇతర పేమెంట్లు చేసుకోవచ్చని తెలిపారు.


జియో ఫైనాన్స్ యాప్‌లో "లోన్ ఆన్‌ చాట్‌" ఫీచర్‌ ద్వారా సులభంగా రుణాలు పొందే అవకాశం ఉందని చెప్పారు. అలాగే మ్యూచువల్‌ ఫండ్స్‌‌పైనా రుణాలు పొందే అవకాశం కల్పించినట్లు తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్‌ను వీక్షించే అవకాశం ఉన్నట్లు చెప్పారు. అయితే పూర్తి రుణానికి ఒకేసారి వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఉద్యోగస్థులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వారికి లోన్‌ సదుపాయం ఉందన్నారు. జీవిత బీమా, ఆరోగ్య బీమా, వాహన బీమా వంటి సదుపాయాలనూ జియో ఫైనాన్స్‌ యాప్‌ అందిస్తోందని చెప్పారు. ఫైనాన్స్ యాప్ ద్వారా చేసే రీఛార్జ్‌లపై ఎటువంటి ఫీజు ఉండదని సమాచారం. ప్రస్తుతం యూపీఐ ప్లాట్‌ఫామ్‌లు ఫీజులను జియో యాప్‌ సమాచారం ఆధారంగా వసూలు చేస్తున్నాయి. మరో విషయం ఏంటంటే.. జియో ఫైనాన్స్‌ యాప్‌ను ఏ సిమ్‌ కార్డుతోనైనా వాడుకోవచ్చని జియో సంస్థ తెలిపింది.

Updated Date - Oct 13 , 2024 | 03:04 PM