Share News

Youtube: యూట్యూబ్ నుంచి మరిన్ని క్రేజీ ఫీచర్లు.. ఎలా పని చేస్తాయంటే..

ABN , Publish Date - Oct 16 , 2024 | 09:41 PM

యూట్యూబ్ తన ప్లాట్‌ఫాంను నిరంతరం అప్‌డేట్ చేస్తూనే ఉంటుంది. దీంతో వినియోగదారులతోపాటు క్రియేటర్లకు కూడా మేలు జరగనుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రకటించిన ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 Youtube: యూట్యూబ్ నుంచి మరిన్ని క్రేజీ ఫీచర్లు.. ఎలా పని చేస్తాయంటే..
youtube new features

యూట్యూబ్(youtube) వీక్షకులు, సృష్టికర్తలకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్‌లను తీసుకొస్తుంది. ఈ క్రమంలోనే మొబైల్, టీవీ, వెబ్, యూట్యూబ్ మ్యూజిక్ వినియోగదారుల కోసం డజన్ల కొద్దీ ఫీచర్లను పరిచయం చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. ఈ అప్‌డేట్‌ల ద్వారా వినియోగదారులు ఈ ప్లాట్‌ఫాంను మునుపటి కంటే సులభంగా, మరింత ప్రభావవంతంగా ఉపయోగించుకునేలా చేస్తాయి. కొత్త ఫీచర్‌లలో మినీప్లేయర్, ప్లేబ్యాక్ స్పీడ్, స్లీప్ టైమర్ వంటివి ఉన్నాయి. ఇవి వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వారి అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.


ప్లేబ్యాక్ స్పీడ్

కీలకమైన విషయం ఏమిటంటే మీరు ఇప్పుడు ప్లేబ్యాక్ వేగాన్ని చాలా ఖచ్చితంగా సర్దుబాటు చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు వీడియోల వేగాన్ని 0.05 ఇంక్రిమెంట్లలో మార్చకోవచ్చు. తద్వారా మీరు మీ సౌలభ్యం ప్రకారం వీడియోను చూడవచ్చు. వీడియో వేగాన్ని తగ్గించడానికి లేదా వేగవంతం చేయాలనుకునే వినియోగదారులకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అదనంగా iOS వినియోగదారులు ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో మెరుగైన బ్రౌజింగ్ విధానాన్ని ఎంచుకోవచ్చు. దీంతోపాటు పెద్ద థంబ్‌నెయిల్‌లు, పెద్ద టెక్స్ట్‌తో నావిగేషన్ సులభతరం అవుతుంది. ఈ మార్పులు మరింత ప్రతిస్పందించే విధంగా బ్రౌజింగ్ అనుభవాన్ని అందిస్తాయి.


మినీప్లేయర్‌ అప్‌డేట్

YouTube మొబైల్ యాప్ మినీప్లేయర్ నుంచి కూడా ఓ అప్‌డేట్ వచ్చింది. ఇది వినియోగదారులను మునుపటి కంటే ఎక్కువ మల్టీ టాస్కింగ్ చేయడానికి అనుమతిస్తుంది. వీక్షకులు మినీప్లేయర్‌ని పరిమాణాన్ని మార్చుకోవచ్చు. తద్వారా వీడియోలను చూడటం, కంటెంట్‌ని బ్రౌజ్ చేయడం సులభం అవుతుంది. వీడియో చూస్తున్నప్పుడు మరిన్ని వీడియోలను క్యూలో చేర్చాలనుకునే వారికి ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది.


ప్లే లిస్ట్

ప్లే జాబితాలను మరింత ఇంటరాక్టివ్‌గా చేయడంపై YouTube దృష్టి సారిస్తోంది. కొత్త ప్లే జాబితా ఫీచర్‌తో వినియోగదారులు ప్రత్యేక లింక్ లేదా QR కోడ్ ద్వారా ప్లేజాబితాకు సహకరించడానికి స్నేహితులు, మీ కుటుంబ సభ్యులను ఆహ్వానించుకోవచ్చు. దీని ద్వారా ఖచ్చితమైన ప్లే జాబితాను సృష్టించుకోవచ్చు.


స్లీప్ టైమర్ ఫీచర్

యూట్యూబ్‌లో మీరు వీడియోలు చూస్తున్నప్పుడు తరచుగా నిద్రపోతున్నారా? అయినా కూడా ఇకపై నో ప్రాబ్లమ్. ఎందుకంటే YouTube అలాంటి వారి కోసం ఇప్పుడు కొత్తగా స్లీప్ టైమర్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా మీరు వీడియో ఎంత సమయం తర్వాత ఆగిపోవాలో టైం సెట్ చేసుకోవచ్చు. దీంతో మీరు స్క్రీన్ సమయాన్ని అవసరమైన సమయం మేరకు చూసిన తర్వాత ఆఫ్ అయ్యేలా మార్చుకోవచ్చు. ఇంతకుముందు ఈ ఫీచర్ ప్రీమియం మెంబర్‌ల కోసం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఫీచర్ అందరు వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.


ఇవి కూడా చదవండి:

Gmail Scam: జీమెయిల్ ఖాతా రికవరీ చేస్తామంటూ కేటుగాళ్ల స్కాం


WhatsApp Hacking: మీ వాట్సాప్ ఖాతా హ్యాకైందో లేదో ఇలా తెలుసుకోండి..

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం.

Business Idea: ఈ వ్యాపారం ఎవర్ గ్రీన్.. రూ.50 వేల పెట్టుబడి, 11 లక్షలకుపైగా లాభం..

For More Technology News and Telugu News

Updated Date - Oct 16 , 2024 | 09:42 PM