Share News

Mysterious Death: అపార్ట్‌మెంట్‌లో ఓపెన్ ఏఐపై ప్రశ్నలు లేవనెత్తిన బాలాజీ మృతదేహం.. అసలేమైంది..

ABN , Publish Date - Dec 14 , 2024 | 02:53 PM

ఓపెన్‌ఏఐ గురించి ఆందోళన వ్యక్తం చేసిన 26 ఏళ్ల మాజీ ఓపెన్‌ఏఐ పరిశోధకుడు సుచిర్ బాలాజీ మరణించాడు. తన ఫ్లాట్‌లో శవమై కనిపించినట్లు శనివారం నివేదికలు వచ్చాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Mysterious Death: అపార్ట్‌మెంట్‌లో ఓపెన్ ఏఐపై ప్రశ్నలు లేవనెత్తిన బాలాజీ మృతదేహం.. అసలేమైంది..
Suchir Balaji

అగ్రరాజ్యం అమెరికాలో ఓపెన్‌ఏఐ గురించి ప్రశ్నించిన 26 ఏళ్ల సుచిర్ బాలాజీ (Suchir Balaji) తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. దీంతో తన మృతి గురించి పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్‌లో ఈ 26 ఏళ్ల AI పరిశోధకుడు.. సామ్ ఆల్ట్‌మాన్ నిర్వహిస్తున్న ChatGPT OpenAI "కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించడం" గురించి ఆందోళనలను లేవనెత్తారు. సమాచారం తెలుసుకున్న శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులు, చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం బాలాజీ బుకానన్ స్ట్రీట్ అపార్ట్‌మెంట్‌లో చనిపోయినట్లు గుర్తించారు.


మరణ వార్త

ఈ క్రమంలో మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం ఈ మరణాన్ని ఆత్మహత్యగా అనుమానిస్తోంది. కానీ ఆయనకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదు. దీంతో ఆయన బంధువులకు కూడా సమాచారం అందించారు. ఆయన మరణం నవంబర్ 26న నిర్ధారించబడింది. కానీ మరణ వార్త ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సాంకేతికత వల్ల సమాజానికి ప్రయోజనం కంటే హాని కలుగుతుందని గ్రహించినప్పుడు కంపెనీని విడిచిపెట్టడానికి ముందు బాలాజీ దాదాపు నాలుగు సంవత్సరాలు OpenAIలో పనిచేశారు. ఈ విచారకరమైన వార్త గురించి తెలుసుకున్నందుకు మేము ఆశ్చర్యపోయామని, ఈ కష్ట సమయంలో ఆయన ఆలోచనలు మాతో ఉన్నాయని OpenAI ప్రతినిధి అన్నారు.


ఇంటర్నెట్‌కు హాని

ఆగస్ట్‌లో కంపెనీకి రాజీనామా చేసిన కొద్దిసేపటికే OpenAI కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడిందని బాలాజీ ఆరోపించారు. OpenAI తన ఉత్పాదక AI ప్రోగ్రామ్, ChatGPTకి శిక్షణ ఇవ్వడానికి సరైన అనుమతి లేకుండా కాపీరైట్ చేసిన మెటీరియల్‌ని ఉపయోగిస్తోందని బాలాజీ బహిరంగంగా పేర్కొన్నారు. చాట్‌జీపీటీ వంటి సాంకేతికతలు ఇంటర్నెట్‌కు హాని కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలే ఆయన మరణానికి కారణమని పలువురు సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు.


ఓ ఇంటర్వ్యూలో

టెస్లా CEO ఎలాన్ మస్క్ కూడా ఈ వార్తలపై ప్రతిస్పందించారు. బాలాజీ కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో పెరిగాడు. ది న్యూయార్క్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో OpenAI పద్ధతులు ఇంటర్నెట్ పర్యావరణ వ్యవస్థకు హానికరమని, సమ్మతి లేకుండా డేటాను ఉపయోగించి వ్యాపారాలు, వ్యక్తులకు హాని చేస్తున్నాయని బాలాజీ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కంప్యూటర్ సైన్స్ చదవడానికి బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చేరాడు.


ఇవి కూడా చదవండి:


Spam Calls: స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఒక్క సెట్టింగ్‌ చేస్తే చాలు.. స్పామ్ కాల్స్ నుంచి రిలీఫ్...

WhatsApp Hacking: మీ వాట్సాప్ ఖాతా హ్యాకైందో లేదో ఇలా తెలుసుకోండి..

Apple iPhone: ఫోన్ల చోరీ నుంచి రక్షణ కోసం క్రేజీ ఫీచర్‌.. వీటిలో మాత్రమే..

Smart Phone Tips: మీ మొబైల్ విషయంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి..

For More Technology News and Telugu News

Updated Date - Dec 14 , 2024 | 02:56 PM