Share News

WhatsApp Secret Feature: మీ పర్సనల్‌ చాట్‌ ఎవరూ చూడొద్దంటే ఇలా చేయండి..

ABN , Publish Date - Sep 22 , 2024 | 12:31 PM

WhatsApp Secret Trick: మేటా సారథ్యంలోని ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది యూజ్ చేస్తున్నారు. చాటింగ్ చేయడానికి.. వీడియో, ఆడియో కాల్స్ కోసం వాట్సాప్ ఎంతగానో ఉపయోపగడుతుంది. అంతేకాదు.. ప్రొఫెషనల్ వర్క్ పరంగానూ వాట్సాప్‌ చాలా విధాలుగా ఉపకరిస్తుంది.

WhatsApp Secret Feature: మీ పర్సనల్‌ చాట్‌ ఎవరూ చూడొద్దంటే ఇలా చేయండి..
WhatsApp

WhatsApp Secret Trick: మేటా సారథ్యంలోని ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది యూజ్ చేస్తున్నారు. చాటింగ్ చేయడానికి.. వీడియో, ఆడియో కాల్స్ కోసం వాట్సాప్ ఎంతగానో ఉపయోపగడుతుంది. అంతేకాదు.. ప్రొఫెషనల్ వర్క్ పరంగానూ వాట్సాప్‌ చాలా విధాలుగా ఉపకరిస్తుంది. అందుకే.. దీనిని ప్రపంచ వ్యాప్తంగా 2 బిలియన్ల కంటే ఎక్కువ మంది యూజర్లు వినియోగిస్తున్నారు. పైగా వాట్సాప్ ఉపయోగించడం చాలా ఈజీ.. ఇంటర్నెట్ ద్వారా స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్‌లోనూ కనెక్ట్ చేసుకోవచ్చు. కొందరు వ్యక్తులు తమ చాట్‌ను రహస్యంగా ఉంచుకుంటారు. ఇందుకోసం థర్డ్ పార్టీ యాప్స్‌ను గానీ.. ఆర్కీవ్‌లో పెట్టడం గానీ చేస్తున్నారు. ఇలా వినియోగదారుల అవసరాలు, ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ అనేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. అయితే, ఇవాళ మనం వాట్సాప్‌లోని సీక్రెట్‌ ట్రిక్ గురించి తెలుసుకుందాం..


వాట్సాప్.. చాటింగ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ పరంగా ఎంతో ఉపయోగపడుతుంది. ప్రపంచంలోని ఏ మూలన ఉన్న వ్యక్తికైనా సులభంగా మెసేజ్ చేయడం, వాయిస్ కాల్ చేయడం, వీడియో కాల్స్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కొందరు వాట్సాప్‌లో తమ ప్రేయసి, ప్రియుడితో వ్యక్తిగత చాట్స్ చేస్తుంటారు. మరికొందరు తమ వర్క్, బిజినెస్‌కు సంబంధించి కాన్ఫిడెన్షయల్ మ్యాటర్స్‌ని కూడా చాట్ చేస్తుంటారు. ఆ చాటింగ్ ఇతరులు చూడకుండా సీక్రెట్‌గా పెట్టేందుకు ప్రయత్నిస్తారు.


చాలా మందికి తెలిసింది ఏంటంటే.. వాట్సాప్‌లో వ్యక్తిగత చాట్‌లను ఆర్కైవ్‌ చేసి చాట్‌ని దాచిపెడతారు. కానీ, చాట్ ఆర్కైవ్ ఫోల్డర్‌కి వెళ్తుంది. హోమ్ స్క్రీన్‌లోనూ ఇది ఈజీగా కనిపిస్తుంది. అంటే చాట్‌లను దాచడానికి ఇది అంత సేఫ్ రూట్ కాదు. ఎవరైనా ఆర్కైవ్ ఫోల్డర్ ఓపెన్ చేస్తే వెంటనే అక్కడ చాట్ అంతా కనిపిస్తుంది. అందుకే మీకోసం సరికొత్త ట్రిక్ చూపించబోతున్నాం.


వాట్సాప్‌లో పర్సనల్ చాట్‌ను ఎవరూ చూడొద్దనుకుంటే.. దాన్ని లాక్ చేయడమే ఉత్తమమైన మార్గం. చాట్‌ను లాక్ చేయడం ద్వారా అది ఎవరికీ కనిపించకుండా ఉంటుంది. చాట్ లాక్ ఫోల్డర్‌కి అది షిఫ్ట్ అవుతుంది. లాక్ చేసిన చాట్‌ను మీరు మాత్రమే యాక్సెస్ చేసేందుకు వీలుంటుంది. తద్వారా ఆ చాట్ సేఫ్‌గా ఉంటుంది.


మరి చాట్ లాక్ చేయడం ఎలా?

మీరు లాక్ చేయాలనుకుంటున్న చాట్‌పై కంటిన్యూ ప్రెస్ చేసి పట్టుకోండి. అప్పుడు స్క్రీన్‌పై కుడివైపు మూలన మూడు చుక్కలు కనిపిస్తాయి. పాప్ అప్ మెనూలో లాక్ చాట్‌ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత మీ చాట్‌కు పాస్‌వర్డ్ కానీ, ఫింగర్ ప్రింట్ గానీ సెట్ చేయాలి. దీంతో ఆ చాట్.. చాట్ లాక్ ఫోల్డర్‌కి షిఫ్ట్ అవుతుంది. మీరు లాక్ చేసిన చాట్‌కి వెళ్లాలంటే.. వాట్సాప్ ఓపెన్ చేయగానే పైన చాట్ లాక్ ఫోల్డర్ కనిపిస్తుంటుంది. దాని లాక్ ఓపెన్ చేస్తే చాట్ లాక్ ఓపెన్ అవుతుంది.


Also Read:

సీఎం చంద్రబాబును కలిసిన టీటీడీ ఈవో

ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్.. కీలక వ్యాఖ్యలు

పాలకు వెళ్లొచ్చే లోపే కోట్లు స్వాహా..

For More Tech News and Telugu News..

Updated Date - Sep 22 , 2024 | 12:31 PM