Youtube: యూట్యూబ్ ప్రీమియం నుంచి మరో అప్‌డేట్
ABN , Publish Date - Feb 02 , 2024 | 07:15 PM
గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ ఈ ఏడాది జనవరి నాటికి ట్రయల్స్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ల మ్యూజిక్, ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లను దాటింది. ఈ సందర్భంగా YouTube ప్రొడక్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆడమ్ స్మిత్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ ఈ ఏడాది జనవరి నాటికి ట్రయల్స్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ల మ్యూజిక్, ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లను దాటింది. ఈ సందర్భంగా 100 కంటే ఎక్కువ దేశాల్లో 100 మిలియన్ల కమ్యూనిటీ మొదట చిన్నగా ప్రారంభమై ఇప్పుడు అనేక మంది సబ్‌స్క్రైబర్లు మద్దతు అందించినందుకు YouTube ప్రొడక్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆడమ్ స్మిత్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో తాము యూట్యూబ్ కమ్యూనిటీకి అత్యుత్తమ అనుభవాన్ని అందించడంపై దృష్టి సారిస్తామని వెల్లడించారు.
మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: Bharat Rice: రూ.29కే కిలో రైస్.. ఎప్పుడు? ఎక్కడ విస్తారు? వివరాలివే..
గత సంవత్సరంలో స్మార్ట్ టీవీలు, టాబ్లెట్‌లు వంటి విభిన్న పరికరాలలో YouTubeను చూడడాన్ని కొనసాగించే సామర్థ్యాన్ని జోడించడంతో పాటు ప్రీమియం ప్లేబ్యాక్ అనుభవాన్ని YouTube మెరుగుపరిచింది. దీంతోపాటు 1080p HD మెరుగైన ఫీచర్‌ను కూడా పరిచయం చేసింది. మరోవైపు శ్రోతల కోసం యూట్యూబ్ ప్లాట్‌ఫారమ్ నమూనాల ట్యాబ్‌ను పరిచయం చేసింది. ఇది కొత్త సంగీతాన్ని పూర్తిగా అనుకూలీకరించిన రేడియో అనుభవాన్ని, YouTube Musicకి పాడ్‌క్యాస్ట్‌లను వేగవంతంగా అందించడానికి సహాయపడుతుంది.
యూట్యూబ్ ప్రీమియం, మ్యూజిక్ 100 మిలియన్ల సబ్‌స్క్రైబర్ మార్క్‌ను దాటడం నిజంగా సంగీత పరిశ్రమకు పెద్ద మైలురాయి అని టీ సిరీస్ చైర్మన్ నీరజ్ కళ్యాణ్ అన్నారు. నాము Googleతో మంచి భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఈ సబ్‌స్క్రిప్షన్ వ్యాపారాన్ని వృద్ధి చేయడంలో సహాయపడుతుందన్నారు. దీంతోపాటు భారతీయ సంగీత వ్యవస్థ మొత్తం వృద్ధికి ఇది దోహదం చేస్తుందన్నారు. అంతేకాదు ఇప్పటికే అనేక మంది సబ్‌స్క్రిప్షన్ తీసుకోకముందే 100 మిలియన్లు దాటితే మరికొన్ని రోజుల్లో ఇది సులభంగా 500 మిలయన్లకు చేరుకుంటుందని పలువురు అంటున్నారు.