Ayodhya: దేశవ్యాప్తంగా అయోధ్యకు వెయ్యి ప్రత్యేక రైళ్లు..
ABN , Publish Date - Jan 23 , 2024 | 10:51 AM
లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా కమలం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. అయోధ్య ఎపిసోడ్‌ను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో బీజేపీ ఉంది. దీనిలో భాగంగానే దేశవ్యాప్తంగా అయోధ్యకు వెయ్యి ప్రత్యేక రైళ్లను వేయడం జరిగింది.
హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా కమలం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. అయోధ్య ఎపిసోడ్‌ను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో బీజేపీ ఉంది. దీనిలో భాగంగానే దేశవ్యాప్తంగా అయోధ్యకు వెయ్యి ప్రత్యేక రైళ్లను వేయడం జరిగింది. బీజేపీ ఆధ్వర్యంలో అయోధ్యకు తెలంగాణ నుంచి రైళ్లు వేశారు. ఈనెల 29 నుంచి ఫిబ్రవరి 15 వరకూ కేంద్రం అయోధ్యకు రైళ్ళు నడపనుంది.
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అయోధ్యకు తెలంగాణ భక్తులు వెళ్లనున్నారు. పార్లమెంట్ పరిధిలోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 200 మందికి అవకాశం కల్పించారు. అయోధ్యకు వెళ్ళి రావడానికి 5 రోజుల సమయం పడుతోంది. ప్రతి భోగికి ఒక ఇన్‌చార్జి... ప్రతి రైలుకు 20 బోగీలు ఉంటాయి. ఒక్కో ట్రైన్‌లో 14 వందల మందికి అవకాశం కల్పించనున్నారు. సికింద్రాబాద్, కాజీపేట రైల్వేస్టేషన్ల నుంచి ట్రైన్స్ ప్రారంభం కానున్నాయి.