Suspension: జేఎన్టీయూలో 15 మంది విద్యార్థుల సస్పెన్షన్
ABN , Publish Date - Oct 08 , 2024 | 03:29 AM
జేఎన్టీయూలో ఇటీవల పరస్పరం దాడులు చేసుకున్న రెండు వర్గాలకు చెందిన 15మంది విద్యార్థులను సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.వి నర్సింహారెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
గత నెల 24న ఘర్షణ.. చర్యలు తీసుకున్న ప్రిన్సిపాల్
హైదరాబాద్ సిటీ , అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): జేఎన్టీయూలో ఇటీవల పరస్పరం దాడులు చేసుకున్న రెండు వర్గాలకు చెందిన 15మంది విద్యార్థులను సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.వి నర్సింహారెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో సెకండియర్ క్లాస్ రిప్రజెంటేటివ్‌ను ఎన్నుకునే విషయంలో విద్యార్థుల మధ్య సెప్టెంబరు 24న వివాదం చోటుచేసుకుంది.
ఆచార్యుల మందలింపుతో గొడవ ఉదయం కొద్దిసేపు సద్దుమణిగినప్పటికీ, సాయంత్రం కళాశాల వెలుపల రెండు వర్గాల విద్యార్థులు మళ్లీ ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్... కారకులైన విద్యార్థులపై చర్యల నిమిత్తం క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. కమిటీ సభ్యులు సమర్పించిన నివేదిక మేరకు 13మంది మెకానికల్ విద్యార్థులు, ఇద్దరు కంప్యూటర్ సైన్స్ విద్యార్ధులపై చర్యలు తీసుకున్నారు. గొడవకు కారకులైన లేఖజ్ అనే విద్యార్థిని నెలరోజులు సస్పెండ్ చేయగా, కొంతమంది