Home » Suspension
సినీనటి కాదంబరి జెత్వానీని అక్రమంగా బంధించి, తప్పుడు కేసుతో వేధించిన వ్యవహారంలో నిఘా విభాగం మాజీ అధిపతి పీఎ్సఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ కాంతిరాణా తాతా, మాజీ డీసీపీ విశాల్ గున్నీ సస్పెన్షన్ను ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది.
ఎస్వీ అగ్రికల్చర్ కాలేజీ ఫిజియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ వి. ఉమామహేష్ సస్పెండయ్యారు.
గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుకు సంబంధించి తిరుపతి ఎఫ్ఏసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ)గా వ్యవహరిస్తున్న సీహెచ్ హరిబాబును ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
విద్యార్థులకు బైబిల్ గంథ్రాలను పంపిణీ చేసిన ఓ ఉపాధ్యాయుడిని అధికారులు సస్పెండ్ చేశారు.
తన సమస్యను పరిష్కరించాలని ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళను లైంగికంగా వేధిస్తున్నట్లు, ఓ ఎన్నారై వద్ద కారు తీసుకుని తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్న సూర్యాపేట జిల్లా మఠంపల్లి ఎస్సై రామాంజనేయులు సస్పెన్షన్కు గురయ్యారు.
ఎన్నికల స్వేచ్ఛగా, సజావుగా జరిగేలా చూడాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి, ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులను ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు. ఫిర్యాదులు అందిన తక్షణమే చర్యలు తీసుకోవాలని, తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారుని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో తెలియజేయాలని కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు
ఖమ్మం జిల్లాలో హిందీ ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ప్రదానోపాధ్యాయులు(హెచ్ఎం)పై సస్పెన్షన్ వేటు పడింది.
‘‘ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలు నిర్వహిస్తున్న ఉద్యమానికి అండగా నిలిచిన ఉపాధ్యాయుడిని ప్రభుత్వం దుర్మార్గంగా సస్పెండ్ చేసింది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా?’
గంజాయి ముఠాలు పట్టుబడితే ఆ పోలీసులకు పండగే! పట్టుబడ్డ సరుకులోంచి కొంత దారి మళ్లించి సొమ్ము చేసుకుంటారు. కొన్ని నెలలుగా వారిది ఇదే పని! ఓ కేసులో పట్టుబడ్డ నిందితులను విచారించిన సమయంలో ఈ దందా బయటపడింది.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి(Kanipakam Varasiddhi Vinayaka Swamy) ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్ గురుకుల్ను సస్పెండ్ చేసినట్లు సోమవారం సాయంత్రం ఈవో గురుప్రసాద్ తెలిపారు. తన పదోన్నతి కోసం తప్పుడు ధ్రువీకరణ పత్రాలను ఆలయానికి సమర్పించారంటూ సోమశేఖర్ గురుకుల్పై లాయర్ రవికుమార్ ఆరునెలల క్రితం దేవదాయ శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేశారు.