Home » JNTU
జేఎన్టీయూ(JNTU) విద్యార్థులకు కొత్త సంవత్సరంలో సరికొత్త సదుపాయాలు అందుబాట్లోకి రానున్నాయి. వర్సిటీలోని వివిధ విభాగాలతో పాటు అన్ని హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు నిరంతరాయమైన ఇంటర్నెట్ (హై-ఫై)సదుపాయాన్ని కల్పించాలని ఇన్చార్జి వీసీ డాక్టర్ బాలకిష్టారెడ్డి(In-charge VC Dr. Balakishta Reddy) నిర్ణయించారు.
జేఎనటీయూ విద్యార్థులకు అత్యధిక వార్షిక వేతనంతో కూడిన ఉద్యోగాలు కల్పిస్తున్నా మని ఇనచార్జ్ వీసీ ప్రొఫెసర్ సుదర్శన రావు తెలిపారు. ఉద్యోగాలు పొందిన విద్యార్థులను గురువారం వీసీ సుదర్శనరావు, రిజిస్ర్టార్ క్రిష్ణయ్య, ఓఎస్డీటూ వీసీ దేవన్న అభినం దించారు.
ఉన్నత విద్యాభ్యాసం, పరిశోధనలకు కొలువుగా నిలవాల్సిన జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయ(Jawaharlal Nehru Technological University) ప్రాంగణం కొన్నాళ్లుగా భారీ ట్రక్కులు, కంటెయినర్లకు పార్కింగ్ స్థలంగా మారింది.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జేఎన్టీయూ(JNTU)కు ఉపకులపతి ఉన్నట్టా, లేనట్టా.. అని ఇటు విద్యార్థులు, అటు ఆచార్యులు సంశయంలో కొట్టుమిట్టాడుతున్నారు. గత మే నెల 21న వైస్ చాన్స్‌లర్‌గా కట్టా నర్సింహారెడ్డి పదవీకాలం ముగియడంతో.. 22నుంచి ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం ఇన్చార్జి వీసీగా బాధ్యతలు చేపట్టారు.
జేఎన్టీయూ(JNTU)కు ఆర్నెల్లుగా రెగ్యులర్ వైస్‌చాన్స్‌లర్ లేరు. గత మే 22 నుంచి యూనివర్సిటీకి ఇన్చార్జి వీసీగా వ్యవహరిస్తున్న ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం(IAS officer Burra Venkatesham)ను ప్రభుత్వం తాజాగా టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియమించింది.
సాయంకాలం బీటెక్‌లో ప్రవేశాలు పొందిన వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు డిసెంబరు 2 నుంచి తరగతులు ప్రారంభిస్తున్నట్లు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ జీవీ నర్సింహారెడ్డి తెలిపారు.
గ్రీన్ అండ్ సస్టెయినబుల్ టెక్నాలజీ్‌సను అభివృద్ధి చేయడంపై హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంతో కలిసి పరిశోధనలు నిర్వహించేందుకు జేఎన్టీయూ సన్నద్ధమవుతోంది.
మహబూబాబాద్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల భూమి, నిధుల కేటాయింపులో వివక్షకు సంబంధించి జాతీయ ఎస్టీ కమిషన్ ఇటీవల సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఢిల్లీలోని కమిషన్ కార్యాలయంలో జేఎన్టీయూ రిజిస్ర్టార్ సోమవారం విచారణకు హాజరయ్యారు.
జేఎన్టీయూ(JNTU)కు ఆర్నెళ్లుగా రెగ్యులర్ వైస్ చాన్స్‌లర్ లేరు. యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డైరెక్టర్ పోస్టుల్లో ఇన్చార్జి అధికారులే కొనసాగుతున్నారు. ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్‌గా నియమితులైన ఐఏఎస్ అధికారి(IAS officer) యూనివర్సిటీకి తరచుగా రాకపోవడంతో వర్సిటీలో పాలన పూర్తిగా గాడితప్పింది.
హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో దాదాపు 30 ఏళ్ల తర్వాత జూనియర్ అసిస్టెంట్ల నియామకం జరిగింది. టీజీపీఎస్సీ గ్రూప్-4 పరీక్ష ద్వారా ఎంపికైన 74 మంది అభ్యర్థులను ప్రభుత్వం జేఎన్టీయూకు కేటాయించింది.