Share News

Keesara: నాగారం గురుకుల విద్యార్థినులకు అస్వస్థత

ABN , Publish Date - Dec 20 , 2024 | 06:03 AM

మేడ్చల్‌ జిల్లా కీసర మండలం నాగారంలోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు 33 మంది గురువారం అస్వస్థతకు గురయ్యారు. వారిని ఘట్‌కేసర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించారు.

Keesara: నాగారం గురుకుల విద్యార్థినులకు అస్వస్థత

  • 33 మందికి వాంతులు, కడుపునొప్పి

కీసర రూరల్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్‌ జిల్లా కీసర మండలం నాగారంలోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు 33 మంది గురువారం అస్వస్థతకు గురయ్యారు. వారిని ఘట్‌కేసర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. వారికి ఉదయం బోండా, మధ్యాహ్నం చికెన్‌కూరతో భోజనం పెట్టారు. సాయంత్రం స్నాక్స్‌ కింద బొప్పాయి ఇచ్చారు. కాసేపటికే విద్యార్థునులు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడడంతో పాటు వాంతులు చేసుకున్నారు. 9 మంది విద్యార్థులు మరీ నీరసంగా ఉండటంతో వారిని ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. మిగతావారిని చికిత్స అనంతరం హాస్టల్‌కు పంపించారు.

Updated Date - Dec 20 , 2024 | 06:03 AM