Telangana Budget: నిరుద్యోగులకు శుభవార్త.. బడ్జెట్లో టీఎస్‌పీఎస్సీకి రూ.40 కోట్లు కేటాయింపు
ABN , Publish Date - Feb 10 , 2024 | 01:03 PM
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,75,891కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో నిరుద్యోగులకు భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు.
హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,75,891కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అందులో రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు కాగా.. మూలధన వ్యయం రూ.29,669 కోట్లుగా పేర్కొన్నారు. బడ్జెట్‌లో నిరుద్యోగులకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలను నిర్వహించే టీఎస్‌పీఎస్సీకి బడ్జెట్‌లో రూ.40 కోట్లు కేటాయించినట్టు మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘యువకులను రెచ్చగొట్టడం కాదు. అక్కున చేర్చుకుంటాం. వారికి ఆసరాగా ఉంటాం ఆదుకుంటాం. జాబ్ క్యాలెడర్ ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేస్తాం. త్వరలోనే మెగా డీఎస్సీ ఉంటుంది. త్వరలో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ చేసి, నియామక పత్రాలు ఇస్తాం. గ్రూప్ -1లో 64 ఉద్యోగాలని చేర్చి భర్తీ చేయబోతున్నాం. గత పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ గ్రూప్ -1 ఉద్యోగాలను ఇవ్వలేదు.’’ అని అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.