Share News

Asara Pension: ఆసరా.. అందిస్తారా..!

ABN , Publish Date - Jul 24 , 2024 | 11:18 AM

ఆసరా పింఛన్‌ అర్హత వయసును గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం(BRS Govt) తగ్గించిన నేపథ్యంలో 57 ఏళ్లు నిండిన వారు రాష్ట్ర ప్రభుత్వం అందించే సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

Asara Pension: ఆసరా.. అందిస్తారా..!

- 57 ఏళ్ల పైబడిన వారి నిరీక్షణ

హైదరాబాద్‌ సిటీ: ఆసరా పింఛన్‌ అర్హత వయసును గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం(BRS Govt) తగ్గించిన నేపథ్యంలో 57 ఏళ్లు నిండిన వారు రాష్ట్ర ప్రభుత్వం అందించే సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మీసేవ కేంద్రాలు, తహసీల్దార్‌(Tehsildar) కార్యాలయాలు, కలెక్టరేట్ల చుట్టూ నిత్యం వందలాది మంది దరఖాస్తులు పట్టుకుని తిరుగుతున్నారు. హైదరాబాద్‌(Hyderabad) జిల్లాలో ఆసరా పథకం కింద వివిధ కేటగిరీల్లో 2,72,548 మంది సాయం పొందుతున్నారు. అయితే, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మూడేళ్ల క్రితం వృద్ధాప్య పింఛన్‌ లబ్ధిదారుల ఎంపిక వయసును 65 నుంచి 57 ఏళ్లకు సడలించింది.

ఇదికూడా చదవండి: మహిళను బెదిరించి రూ. 2.90లక్షలు లూటీ.. అసలేం జరిగిందంటే..


తొలి విడతలో 58,607 మంది..

2021లో దరఖాస్తు చేసుకున్న 57 ఏళ్ల వయసు కలిగిన వారి ఆర్థిక జీవనస్థితిపై 2022లో క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. అనంతరం దరఖాస్తు చేసుకున్న 89,560 మందిలో 58,607 మంది అర్హులుగా గుర్తించారు. పింఛన్‌ వయసును సడలించిన నేపథ్యంలో పెద్దఎత్తున దరఖాస్తులు రావడంతో సర్కారు ఖజానాపై ఆర్థిక భారం ఎక్కువైంది. దీంతో మిగతా వారిని ఎంపిక చేయలేదు.


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 24 , 2024 | 11:18 AM