Share News

ABVP: నేటి నుంచి ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలు

ABN , Publish Date - Dec 23 , 2024 | 03:37 AM

సిద్దిపేట జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ) 43వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ తెలిపారు.

ABVP: నేటి నుంచి ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలు

  • సిద్దిపేటలో నిర్వహణ.. ఏర్పాట్లు పూర్తి

సిద్దిపేట క్రైం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ) 43వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం సమీపంలో జరిగే మహాసభలను రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సోమవారం ప్రారంభిస్తారని చెప్పారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో విలేకరులతో ఆమె మాట్లాడారు.


ఈ కార్యక్రమానికి ఏబీవీపీ జాతీయ కార్యదర్శి ఆశిష్‌ చౌహ, రాష్ట్ర నలుమూలల నుంచి 1,500 మంది వరకు ప్రతినిఽధులు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ మహాసభలలో మొదటి సెషన్‌లో డ్రగ్స్‌ ఫ్రీ క్యాంప్‌స్‌ కార్యక్రమం పేరిట మత్తు పదార్థాల వల్ల కలుగుతున్న అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. అలాగే గవర్నర్‌ ఆధ్వర్యంలో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులతో పాటు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు.

Updated Date - Dec 23 , 2024 | 03:37 AM