TS News: గొర్రెల స్కాంలో రాజకీయ నాయకుల పాత్రపై విచారించనున్న ఏసీబీ..!
ABN , Publish Date - Jun 11 , 2024 | 09:34 AM
గొర్రెల స్కాములో 2వ రోజు కస్టడీ విచారణ ప్రారంభమైంది. పశుసంవర్ధక ఎండీ రామచందర్, ఓఎస్డీ కల్యాణ్‌ని ఏసీబీ విచారించనుంది. మొదటిరోజు కస్టడీ విచారణలో రామచందర్ నోరు మెదపడం లేదని తెలుస్తోంది. విచారణకు రామచందర్‌తో పాటుగా ఓఎస్డీ కల్యాణ్ సహకరించడం లేదని సమాచారం. గొర్రెల స్కీము యూనిట్ కాస్ట్ పెంపు, దళారుల ప్రమేయంపై ఏసీబీ విచారణ చేస్తోంది.
హైదరాబాద్: గొర్రెల స్కాములో 2వ రోజు కస్టడీ విచారణ ప్రారంభమైంది. పశుసంవర్ధక ఎండీ రామచందర్, ఓఎస్డీ కల్యాణ్‌ని ఏసీబీ విచారించనుంది. మొదటిరోజు కస్టడీ విచారణలో రామచందర్ నోరు మెదపడం లేదని తెలుస్తోంది. విచారణకు రామచందర్‌తో పాటుగా ఓఎస్డీ కల్యాణ్ సహకరించడం లేదని సమాచారం. గొర్రెల స్కీము యూనిట్ కాస్ట్ పెంపు, దళారుల ప్రమేయంపై ఏసీబీ విచారణ చేస్తోంది. ఎవరి ప్రమేయంతో దళారి, భోగస్ కంపెనీతో గొర్రెలను రైతులకు కొనుగోలు చేసి ఇవ్వాలని ఆదేశించారు అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ఏసీబీ విచారిస్తోంది. రెండో రోజు కస్టడీ విచారణలో రాజకీయ నాయకుల పాత్ర, ఓఎస్డీ కల్యాణ్ ఫైల్స్ తరలింపు, ఫైళ్ల కాల్చివేత వీటన్నింటిపై ఏసీబీ అరా తీస్తోంది.