Hyderabad: స్కిల్స్‌ యూనివర్సిటీకి 200 కోట్లు ‘మేఘా’ విరాళం | Adani Group and Megha Engineering Pledge ₹200 Crores
Share News

Hyderabad: స్కిల్స్‌ యూనివర్సిటీకి 200 కోట్లు ‘మేఘా’ విరాళం

ABN , Publish Date - Oct 27 , 2024 | 04:01 AM

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు.. ‘యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ’కి మరో భారీ విరాళం అందింది. అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతం అదానీ ఇటీవలే రూ.100 కోట్లు అందించగా శనివారం అంతకు రెట్టింపు విరాళాన్ని ‘మేఘా’ ప్రకటించింది.

Hyderabad: స్కిల్స్‌ యూనివర్సిటీకి 200 కోట్లు ‘మేఘా’ విరాళం

  • భవనాల నిర్మాణం, మౌలిక వసతుల బాధ్యత

  • ప్రభుత్వంతో మేఘా ఫౌండేషన్‌ ఒప్పందం

  • వర్సిటీ మాస్టర్‌ ప్లాన్‌ను అందించిన సంస్థ

  • అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం

  • వారంలో డిజైన్లు ఖరారు చేయండి..

  • 8న పనులు ప్రారంభించండి: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు.. ‘యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ’కి మరో భారీ విరాళం అందింది. అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతం అదానీ ఇటీవలే రూ.100 కోట్లు అందించగా శనివారం అంతకు రెట్టింపు విరాళాన్ని ‘మేఘా’ ప్రకటించింది. 150 ఎకరాల్లో ఫోర్త్‌ సిటీలో నిర్మించబోయే స్కిల్స్‌ యూనివర్సిటీ క్యాంపస్‌ భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి బాధ్యతను ప్రముఖ నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) తీసుకుంది. దీనికి అవసరమయ్యే రూ.200 కోట్లను తాము భరిస్తామని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో మేఘా ఫౌండేషన్‌ పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

స్కిల్స్‌ యూనివర్సిటీలో తమవంతుగా.. కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా రూ.200 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనాల నిర్మాణం చేపడతామని ఎంఈఐఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీవీ కృష్ణారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌ సమక్షంలో శనివారం సచివాలయంలో జరిగిన ఎంవోయూ కార్యక్రమం జరిగింది. మేఘా ఫౌండేషన్‌ను ముఖ్యమంత్రి అభినందిస్తూ స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటులో మరో ముందడుగు పడిందన్నారు. వర్సిటీ అకడమిక్‌, అడ్మినిస్ట్రేటివ్‌, లేబొరేటరీ బ్లాక్‌లు, గ్రంథాలయం, కంప్యూటర్‌ హబ్‌, విద్యార్థి, సిబ్బంది వసతి భవన సముదాయాలను మేఘా ఫౌండేషన్‌ నిర్మించనుంది. వీటి డిజైన్లను సీఎం సమక్షంలో ప్రదర్శించారు. వారంలో డిజైన్లకు తుదిరూపు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులను నవంబరు 8న ప్రారంభించనున్నారు. వర్సిటీ నిర్మాణానికి ఇప్పటికే సీఎం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్‌పేటలో శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

Updated Date - Oct 27 , 2024 | 04:01 AM