ఆదివాసీల బంద్ ప్రశాంతం
ABN , Publish Date - Sep 21 , 2024 | 10:22 PM
ఆదివాసీ మహిళపై దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆది వాసీ సంఘాల బంద్ ప్రశాంతంగా జరిగింది. శని వారం ఆదివాసీ సంఘాల నాయకులు కాంటా చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.
బెల్లంపల్లి, సెప్టెంబరు 21: ఆదివాసీ మహిళపై దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆది వాసీ సంఘాల బంద్ ప్రశాంతంగా జరిగింది. శని వారం ఆదివాసీ సంఘాల నాయకులు కాంటా చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు మద్ద తు తెలిపారు. ఆదివాసీ మహిళకు అన్యాయం జరిగితే ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరైంది కాదన్నారు. నిందితుడిని ఉరితీయాలని, బాధిత మహిళకు రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. గోపాల్, భీమయ్య, రాజేష్, శ్రీహరి, రాజనర్సు, బాపు, ప్రతాప్, రాజనర్సు, మల్లేశ్వరి, విజయ పాల్గొన్నారు.
జన్నారం: బంద్‌లో భాగంగా ఆదివాసీ సంఘం నాయకులు తహసీల్దార్ కార్యాలయం, పోలీస్‌స్టేషన్‌లో నిందితుడిని శిక్షించాలని వినతిపత్రాలు అందించారు. నాయకులు మాట్లాడుతూ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. కాళి, దర్ముపటేల్, గంగుపటేల్, సోనేరావు, లక్ష్మణ్, జంగు, అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.
తాండూర్: ఆదివాసి మహిళపై దాడి చేసిన నింది తుడిని ఉరితీయాలని ఆదివాసి హక్కుల పోరాట సమి తి నాయకులు తహసీల్దార్ ఇమ్రాన్‌ఖాన్‌కు వినతి పత్రం అందించారు. కిష్టంపేట గ్రామ పంచాయతీలో అక్రమ కట్టడాలకు నోటీసులు ఇవ్వాలని కోరారు. గడ్డం మణికుమార్, రవీందర్, సమ్మయ్య పాల్గొన్నారు.
కాసిపేట: గిరిజన మహిళపై అత్యాచారయత్నం, దాడి చేసిన నిందితుడికి ఉరి శిక్ష వేయాలని ఆదివాసీ సంఘాలు నాయకులు డిమాండ్ చేశారు. బంద్ సంద ర్భంగా దుకాణాలు, పాఠశాలలు, వ్యాపార సంస్థలను మూసివేశారు. కొండాపూర్ యాప ప్రాంతం నిర్మాను ష్యంగా మారింది. ఆదివాసీ గిరిజన నాయకులు తహ సీల్దార్ భోజన్నకు వినతిపత్రం అందించారు. ఆడె జం గు, పెంద్రం హన్మంతు, ఆత్రం జంగు, వెంకటేష్, కుర్సెంగ తిరుపతి, కనకరాజు, ప్రభాకర్ పాల్గొన్నారు.
చెన్నూరు: జైనూరులో ఆదివాసీ మహిళపై అత్యా చారయత్నం, దాడి ఘటనకు నిరసనగా ఆదివాసీ సంఘాల బంద్ సంపూర్ణంగా జరిగింది. కారణమైన నిందితున్ని కఠినంగా శిక్షించాలని ఆదివాసీ, తుడుం దెబ్బ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
భీమారం: ఆదివాసీ మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితున్ని ఉరి తీయాలని ఆదివాసీ నాయ కులు పేర్కొన్నారు. మండల కేంద్రంలో దుకాణాలను మూసివేయించి తహసీల్దార్‌కు వినతిపత్రం అందిం చారు. మల్లేష్, సమ్మయ్య, బాపు, బాపురావు, కొండయ్య, భరత్, రాజేందర్ పాల్గొన్నారు.