మెరుగైన వైద్య సేవలందించాలి
ABN , Publish Date - Oct 22 , 2024 | 11:12 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. బెల్లంపల్లిలోని వంద పడకల ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శిం చారు. ఆసుపత్రిలోని మందుల నిల్వలు, రికార్డులు, రిజిష్టర్‌లను, వార్డులను పరిశీలించారు.
బెల్లంపల్లి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. బెల్లంపల్లిలోని వంద పడకల ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శిం చారు. ఆసుపత్రిలోని మందుల నిల్వలు, రికార్డులు, రిజిష్టర్‌లను, వార్డులను పరిశీలించారు. మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి కమిషనర్, చైర్‌ప ర్సన్‌తో అభివృద్ధి పనుల గురించి తెలుసుకున్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడా లన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయు లు సమయపాలన పాటించాలన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ రవి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్,చైర్‌పర్సన్ జక్కుల శ్వేత ఉన్నారు.
భూసేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలి
మంచిర్యాల కలెక్టరేట్, (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారుల నిర్మా ణంలో భాగంగా భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు భవ నాలు, రవాణా శాఖ కార్యదర్శి దాసరి హరిచందన అన్నారు. మంగళవారం హైద్రాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, అధికారు లతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మంచి ర్యాల- వరంగల్-ఖమ్మం-విజయవాడ జాతీయ రహదారి 163జీ 334 కిలోమీ టర్లు ఉంటుందని, ఇందుకు 1383 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంటుం దన్నారు. ఆర్మూర్-జగిత్యాల, మంచిర్యాల జాతీయ రహదారి 63 నిర్మాణం 132 కిలో మీటర్ల మేర ఉంటుందని, 536.9 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంటుందని తెలిపారు. భూసేకరణ అవార్డు జారీ చేసి భూ బదలాయింపు జరగని రైతులు, యజమానులతో చర్చించి ఆర్బిట్రేషన్‌కు వచ్చేలా చర్యలు తీసు కోవాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్ సమావేశం నిర్వహించారు. భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని పేర్కొన్నారు.