Share News

రౌడీషీటర్లు పద్ధతి మార్చుకోవాలి

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:14 PM

రౌడీషీటర్లు తమ పద్ధతి మార్చుకోవాలని, ఎలాంటి నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో మెలగాలని, లేదంటే కమిషనరేట్‌ పరిధి నుంచి బహిష్కరిస్తామని రామగుండం సీపీ శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటర్స్‌కు కౌన్సెలింగ్‌ నిర్వహించి సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

రౌడీషీటర్లు పద్ధతి మార్చుకోవాలి

మంచిర్యాల అర్బన్‌, అక్టోబర్‌ 22 (ఆంధ్రజ్యోతి): రౌడీషీటర్లు తమ పద్ధతి మార్చుకోవాలని, ఎలాంటి నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో మెలగాలని, లేదంటే కమిషనరేట్‌ పరిధి నుంచి బహిష్కరిస్తామని రామగుండం సీపీ శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటర్స్‌కు కౌన్సెలింగ్‌ నిర్వహించి సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. రౌడీ షీట్‌ ఉన్న ప్రతీ ఒక్కరిపై ప్రత్యేక నిఘా ఉంటుందని, మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తామని, పీడీ యాక్టు అమలు చేస్తామన్నారు. ఇకపై ఎలాంటి కేసుల్లోనైనా వారి పేర్లు వినిపించినా, ఉన్నట్లు తెలిసినా అన్ని యాక్టులను అమలు పరిచి శాశ్వతంగా జైలు జీవితం గడిపేలా చేస్తామని హెచ్చరించారు. నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో మెదిలితే రౌడీషీట్‌లను ఎత్తివేస్తామన్నారు. గంజాయి, పీడీఎస్‌ రైస్‌, నకిలీ విత్తనాలు, గుట్కా, ఆర్గనైజ్డ్‌ క్రైమ్స్‌కు పాల్పడినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మధ్యకాలంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న రెండు లాడ్జిలను సీజ్‌ చేశామని సీపీ వెల్లడించారు. డీసీపీ ఏ.భాస్కర్‌, మంచిర్యాల, జైపూర్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీలు ఆర్‌.ప్రకాష్‌, వెంకటేశ్వర్లు, రాఘవేంద్రరావు, టౌన్‌, రూరల్‌ సీఐలు ప్రమోద్‌రావు, అశోక్‌కుమార్‌, సీఐలు నరేందర్‌, రవీందర్‌, శశిధర్‌ రెడ్డి, దేవయ్య, అప్జలోద్దిన్‌, నరేష్‌ కుమార్‌, ఏస్సైలు పాల్గొన్నారు.

మంచిర్యాల పోలీస్‌ స్టేషన్‌ను పరిశీలించిన సీపీ

మంచిర్యాల పట్టణ పోలీస్‌ స్టేషన్‌ను రామగుండం సీపీ శ్రీనివాస్‌ డీసీపీ భాస్కర్‌, ఏసీపీ ప్రకాష్‌లతో కలిసి మంగళవారం తనిఖీ చేశారు. ఆయన పోలీస్‌స్టేషన్‌లో రికార్డులను, పెండింగ్‌ ఫైల్స్‌ పరిశీలించి దర్యాప్తుల్లో ఉన్న కేసులపై ఆరా తీశారు. ట్రైనీ ఎస్సైతో మాట్లాడి స్టేషన్‌లో రికార్డులు, చేయాల్సిన విధుల గురించి అధికారులను, సిబ్బందిని తెలుసుకోవాలని సూచించారు. అనంతరం నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీపీ పలు సూచనలు చేశారు.

Updated Date - Oct 22 , 2024 | 11:14 PM