Share News

సర్వే ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలి

ABN , Publish Date - Nov 01 , 2024 | 11:06 PM

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రం, రాపల్లి గ్రామంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల ఇతర అన్ని అంశాలపై ప్రభుత్వం చేపట్టిన సర్వేను జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలన్నారు.

సర్వే ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలి

హాజీపూర్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రం, రాపల్లి గ్రామంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల ఇతర అన్ని అంశాలపై ప్రభుత్వం చేపట్టిన సర్వేను జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఎన్యుమరేషన్‌ బ్లాక్‌ల ప్రకారం నిర్ణీత నమూనాలో కుటుంబాల వివరాలను నమోదు చేయాలన్నారు. ప్రతి 10 ఎన్యుమరేషన్‌ బ్లాక్‌లకు ఒక సూపర్‌వైజర్‌ను నియమించి వివరాలను పునఃపరిశీలిస్తామన్నారు. వివరాల సేకరణలో గోప్యత, నైతిక ప్రమాణాలు పాటించాలన్నారు. తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావు దేశ్‌పాండే, ఎంపీడీవో ప్రసాద్‌, మండల పంచాయతీ అధికారి తదితరులు పాల్గొన్నారు.

సర్వేపరిశీలించిన ఎమ్మెల్యే

బెల్లంపల్లిరూరల్‌ (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని రెండవ వార్డులో చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేను ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ పరిశీలించారు. సర్వేను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ఆర్డీవో హరికృష్ష, మున్సిపల్‌ చైర్మన్‌ జక్కుల శ్వేత, కమిషనర్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సమగ్ర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఆర్డీవో హరికృష్ణ సూచించారు. శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయంలో సర్వే సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి రాజకీయ, కులం అంశాలపై సర్వే చేపట్టాలన్నారు. ప్రతి ఇంటిలోని కుటుంబాల వివరాలను నమోదు చేయాలని, ఏ ఒక్క ఇంటిని వదిలిపెట్టవద్దని సూచించారు. మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు, చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

జన్నారం, (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే మండలంలో ప్రారంభమైంది. పొనకల్‌ గ్రామంలో నిర్వహించిన సర్వేను డీఆర్‌డీవో కిషన్‌ పరిశీలించారు. రోజు సర్వే నివేదికను అందించాలని, తప్పులు లేకుండా చేయాలన్నారు. రోజు 150 కుటుంబాలను గుర్తించి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఏపీవో రవీందర్‌,ఏపీఎం బుచ్చన్న, ఈవో రాహుల్‌గుప్తా తదితరులు ఉన్నారు.

జైపూర్‌, (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే మండలంలో ప్రారంభమైంది. మండల కేంద్రంలో జరిగిన సర్వేను ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీవో శ్రీపతి బాపురావులు పరిశీలించారు. ఎన్యుమరేట్‌ బ్లాక్‌ వారీగా ప్రతీ ఇంటికి సర్వే స్టిక్కర్లను అంటించారు. ఏపీవో వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి ఉదయ్‌కుమార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

భీమారం, (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా సామాజిక సర్వే శుక్రవారం ప్రారంభమైంది. శుక్రవారం ఇంటింటికి వెళ్లి మొదటి దఫాగా స్టిక్కర్లను కుటుంబ యజమాని ఇంటికి అతికించారు. సర్వే రెండు దఫాలుగాకొనసాగుతుందని తెలిపారు. ఉపాధి సిబ్బంది, ఉపాధ్యాయులు, ఎంపీడీవో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మందమర్రిరూరల్‌, (ఆంధ్రజ్యోతి) : ఇంటింటికి సర్వేకు సహకరించాలని ఎంపీడీవో రాజేశ్వర్‌ సూచించారు. శుక్రవారం చిర్రకుంటలో జరుగుతున్న సర్వేను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సిబ్బంది సర్వేను పకడ్బందీగా చేపట్టాలన్నారు.

Updated Date - Nov 01 , 2024 | 11:06 PM