Medical Admissions: నిబంధనలు సవరించే అధికారం సర్కార్‌కు ఉంది
ABN , Publish Date - Aug 29 , 2024 | 03:32 AM
వైద్య విద్య కోర్సులైన ఎంబీబీఎస్, బీడీఎ్‌సలో కాంపిటెంట్ కోటా కింద ప్రవేశాలకు ఎవరు స్థానికులో నిర్ధారించడంతో పాటు నిబంధనలు జారీ చేసి అధికారం ప్రభుత్వానికి ఉందని అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి చెప్పారు.
మెడికల్ కోర్సుల స్థానికత జీవోపై ఏజీ వాదన
హైదరాబాద్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్య కోర్సులైన ఎంబీబీఎస్, బీడీఎ్‌సలో కాంపిటెంట్ కోటా కింద ప్రవేశాలకు ఎవరు స్థానికులో నిర్ధారించడంతో పాటు నిబంధనలు జారీ చేసి అధికారం ప్రభుత్వానికి ఉందని అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి చెప్పారు. నీట్ పరీక్షకు ముందు వరసగా నాలుగేళ్లు (తొమ్మిది, పది, ఇంటర్) తెలంగాణలోనే చదివి ఉండడంతోపాటు పరీక్షలు సైతం ఇక్కడే రాసి ఉండాలంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33 చట్టబద్ధతపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావు ధర్మాసనం బుధవారం విచారణ కొనసాగించింది.
ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపిస్తూ.. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం పదేళ్లపాటు ఏపీ విద్యార్థులకు నష్టం లేకుండా ఉమ్మడి కోటా కొనసాగిందన్నారు. ఆ గడువు ముగిసిపోవడంతో స్థానికతపై నిబంధనలు రూపొందించుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపారు. స్థానిక విద్యార్థులకు న్యాయం జరిగేలా నిబంధనలను సవరించినట్లు చెప్పారు. ప్రభుత్వ చర్యలను సుప్రీంకోర్టు సైతం సమర్థించిందని గుర్తు చేశారు. తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది.