Share News

Ashok Reddy: బెయిల్‌ ఉత్తర్వులు అందినా.. అక్రమంగా నిర్బంధించారు

ABN , Publish Date - Dec 15 , 2024 | 04:22 AM

మద్యంతర బెయిల్‌ ఉత్తర్వులు అందిన తర్వాత కూడా అల్లు అర్జున్‌ను విడుదల చేయకుండా అక్రమంగా నిర్భందించారని ఆయన తరపు న్యాయవాది అశోక్‌రెడ్డి ఆరోపించారు.

Ashok Reddy: బెయిల్‌ ఉత్తర్వులు అందినా.. అక్రమంగా నిర్బంధించారు

  • ప్రభుత్వం సమాధానం చెప్పాలి

  • అల్లు అర్జున్‌ అడ్వొకేట్‌ అశోక్‌రెడ్డి

  • కాంగ్రెస్‌ను వీడే యోచనలో అల్లు అర్జున్‌ మామ

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): మద్యంతర బెయిల్‌ ఉత్తర్వులు అందిన తర్వాత కూడా అల్లు అర్జున్‌ను విడుదల చేయకుండా అక్రమంగా నిర్భందించారని ఆయన తరపు న్యాయవాది అశోక్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వుల్లో తక్షణమే విడుదల చేయాలని స్పష్టంగా ఉన్నా జైలు అఽధికారులు పాటించలేదని విమర్శించారు. అందుకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఈ విషయమై న్యాయ ప్రక్రియ కొనసాగిస్తామని పేర్కొన్నారు. కాగా అల్లు అర్జున్‌ మామ కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి కాంగ్రెస్‌ వీడనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎలాంటి తప్పు లేకున్నా అల్లుడిని అరెస్టు చేశారని, బెయిల్‌ వచ్చినా జైలుకి పంపారని అనుచరుల వద్ద ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితిలో పార్టీలో కొనసాగీతే అవమానం అనే భావనతో కాంగ్రె్‌సకు రాజీనామా చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Updated Date - Dec 15 , 2024 | 04:22 AM