Share News

TG Politics: పింక్ బుక్‌లో వారి పేర్లు.. అదికారంలోకి వచ్చాకా..

ABN , Publish Date - Nov 20 , 2024 | 05:54 PM

వరంగల్ సభా వేదికగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలోని అగ్రనేతలు ఎ.జీవన్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య వేర్వేరుగా సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు

TG Politics: పింక్ బుక్‌లో వారి పేర్లు.. అదికారంలోకి వచ్చాకా..

హైదరాబాద్, నవంబర్20: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మంగళవారం వరంగల్ వేదికగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవ సభలో బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కారు పార్టీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి వేళ.. ఆ పార్టీ అగ్రనేతలు వరుసగా స్పందిస్తున్నారు. బుధవారం నిజామాబాద్ లో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఏ జీవన్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలని హితవు పలికారు.

Also Read: మావోయిస్టు అగ్రనేత కీలక నిర్ణయం.. రంగంలోకి పోలీసులు


వరంగల్ సభలో సీఎం రేవంత్.. రైతుల విషయంలో మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలు అని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయటం ఎవరికి సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్ లను టచ్ చేస్తే తెలంగాణ రాష్టం అగ్గిపాలవుతుందని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ముందు తన గ్రామంలోని సంగతి చూసుకుంటే చాలని వ్యంగ్యంగా అన్నారు. ఈ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు.

Also Read: New Bike in Market: ఒక్క సారి ఛార్జింగ్ చేస్తే.. 140 కిలోమీటర్లు దూసుకు పోతుంది..


మరో మూడు నెలల్లో కాంగ్రెస్ నేతలు బయట తిరగ లేరన్నారు. తెలంగాణను ఆంధ్రలో కలిపేందుకు సీఎం రేవంత్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలికిన పోలీసుల జాతకాలు పింక్ డైరీలో నోట్ చేస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన అనంతరం వారి సంగతి చూస్తామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.


ఇక తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను తిట్టి పోయడం రేవంత్ రెడ్డికి సంబరమా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ను ఎదుర్కొనే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. అయితే వేదిక ఏదైనా సీఎం రేవంత్ రెడ్డి తీరు మాత్రం మారటం లేదని.. చివరకు అసెంబ్లీ సమావేశాల్లో సైతం ఆయన ఇలాగే మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు.


కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టుల వల్లే భూగర్భ జలాలు పెరిగాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆ క్రమంలోనే పంట దిగుబడి సైతం పెరిగిందని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద రేవంత్ కు అసలు అవగాహన ఉందా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై తనతో చర్చకు రావాలని సీఎం రేవంత్ కు ఈ సందర్బంగా ఆయన సవాల్ విసిరారు.


బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొక్క కాదు.. మహావృక్షం అని అభివర్ణించారు. ఆయన్ని అంతం చేయడం సీఎం రేవంత్ వల్ల అవుతుందా? అని మండిపడ్డారు. రేవంత్ లాంటి వాళ్ళు ఎంతో మంది వస్తారు.. పోతారు. బీఆర్ఎస్ మాత్రం అలానే ఉంటుందన్నారు. వరంగల్ లో కాళోజీ కళా క్షేత్రం కేసీఆర్ ప్రభుత్వ హయంలోనే నిర్మాణం అయిందన్నారు. ఆ క్రెడిట్ తీసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గుండాలంటూ చరకలంటించారు.


అయితే కేసీఆర్ మొక్క కాదు.. కానీ రేవంతే మొక్క అని ఆయన స్పష్టం చేశారు. అలాంటి మొక్కను వేళ్ళతో పీకేసే రోజు త్వరలోనే వస్తుందని ఆయన ఆశాభవం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హై కమాండ్ నియమిస్తే వద్దన్నామా? తీసేస్తే కూడా వద్దనమని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు.

For Telangana News And Telugu News

Updated Date - Nov 20 , 2024 | 06:16 PM