ఆటోల బంద్ విరమణ.. వెనక్కి తగ్గిన జేఏసీ
ABN , Publish Date - Dec 07 , 2024 | 04:17 AM
తమ సమస్యలను పరిష్కారించాలని కోరుతూ ఆటో కార్మికులు శనివారం నిర్వహించతలపెట్టిన ఆటోల బంద్‌ను తాత్కలికంగా విరమిస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది.
హైదరాబాద్, డిసెంబర్ 6(ఆంధ్రజ్యోతి): తమ సమస్యలను పరిష్కారించాలని కోరుతూ ఆటో కార్మికులు శనివారం నిర్వహించతలపెట్టిన ఆటోల బంద్‌ను తాత్కలికంగా విరమిస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది. ప్రజాపాలన విజయోత్సవాలు ముగిసిన వెంటనే ఆటో డ్రైవర్ సంఘాల ప్రతినిధులతో చర్చించి సమస్యలు పరిష్కారిస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేఏసీ కన్వీనర్ వెంకటేశం తెలిపారు.
బంద్‌ను విజయవంతం చేయడం కోసం ఏఐటీయూసీ కార్యాలయంలో సమావేశమైన ఆటో సంఘాల ప్రతినిధుల సమక్షంలో శుక్రవారం రాత్రి సీసీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్‌లో మాట్లాడారని తెలిపారు. ఈ నెల 10,11 తేదీల్లో కార్మికులతో చర్చలు జరుపుతామని, బంద్‌ను వాయిదా వేసుకోవాలని కోరారని చెప్పారు.