Share News

Balkampeta Ellamma: 9న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం..

ABN , Publish Date - Jun 21 , 2024 | 10:07 AM

జూలై 9న జరగనున్న బల్కంపేట ఎల్లమ్మ(Balkampeta Ellamma) కల్యాణం విజయవంతానికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని వెస్ట్‌జోన్‌ డీసీపీ విజయ్‌ కుమార్‌(Westzone DCP Vijay Kumar) పిలుపునిచ్చారు.

Balkampeta Ellamma: 9న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం..

- అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

- డీసీపీ విజయ్‌కుమార్‌

హైదరాబాద్: జూలై 9న జరగనున్న బల్కంపేట ఎల్లమ్మ(Balkampeta Ellamma) కల్యాణం విజయవంతానికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని వెస్ట్‌జోన్‌ డీసీపీ విజయ్‌ కుమార్‌(Westzone DCP Vijay Kumar) పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ఆలయ ఆవరణలో ఎస్‌ఆర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనాథరెడ్డి వివిధ శాఖలతో ఏర్పాటు చేయించిన సమావేశానికి విచ్చేసిన డీసీపీ పలు సలహాలు, సూచనలు చేశారు. భక్తులకు తగిన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా ఎండ వేడిమి అధికంగా ఉన్నందున వాటర్‌ వర్క్స్‌ అధికారులు మంచినీటి సమస్య తలెత్తకుండా చలివేంద్రాలు, వాటర్‌ బాటిల్స్‌, ప్యాకెట్లను ఆలయం చుట్టు ఉన్న అన్ని విధుల్లో అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను కోరారు. విద్యుత్‌ అంతరాయం తలెత్తకుండా ట్రాన్స్‌కో అధికారులు, ఎప్పటికప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా జీహెచ్‌ఎంసీ అఽధికారులు, రోడ్లు భవనాల శాఖ భారీకేడ్లు,ఆలయానికి వచ్చే భక్తులు అస్వస్థకు లోనైతే వైద్య ఆరోగ్య శాఖ శిభిరాలను ఏర్పాటు చేసి సకాలంలో వైద్యం అంధించాలన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ‘రివార్డ్‌’లతో వల.. కూపన్లతో ఖాతాలు ఖల్లాస్‌


ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా, ట్రాఫిక్‌ పోలీసులు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుని వాహనాల మళ్లింపు చేపట్టాలన్నారు. శాంతి భద్రతల విషయంలో పోలీస్‌ శాఖ అప్రమత్తంగా ఉంటుందన్నారు. కల్యాణం జరిగి ఆలయం ముందు, చుట్టు పక్కల ఐ రెజుల్యూషన్‌ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వీటిని ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ కు అనుసంధానించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందాన్నారు జూలై 8న ఎదుర్కోళ్లు, 9న కల్యాణం, 10 రథోత్సవం ఉన్న దృష్ట్యా భారీగా పోలీసు బలగాలను అందుబాటులో ఉంచుతామన్నారు. అలాగే ఏలాంటి సమస్య తలెత్తిన ఆలయం వద్ద ఏర్పాటు చేసే పోలీస్‌ ఔట్‌ పోస్ట్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు. సమావేశంలో ఈవో అంజనీదేవి, ట్రాఫిక్‌ అడిషనల్‌ డీసీపీ రంగారావు, ఏసీపీ వెంకటరమణ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 21 , 2024 | 10:07 AM