Share News

Bandi Sanjay: హామీల చర్చను మళ్లించేందుకే ‘హైడ్రా’మాలు

ABN , Publish Date - Sep 10 , 2024 | 04:34 AM

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుంచి చర్చను మళ్లించేందుకు హైడ్రా పేరుతో డ్రామాలు మొదలు పెట్టిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ విమర్శించారు.

Bandi Sanjay: హామీల చర్చను మళ్లించేందుకే ‘హైడ్రా’మాలు

  • కాంగ్రెస్‌పై ప్రజల్లో విరక్తి..బీఆర్‌ఎస్‌ అవుట్‌ డేటెడ్‌: సంజయ్‌

భగత్‌నగర్‌, సెప్టెంబరు 9: కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుంచి చర్చను మళ్లించేందుకు హైడ్రా పేరుతో డ్రామాలు మొదలు పెట్టిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక, వ్యతిరేకతను దారి మళ్లించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రె్‌సపై ప్రజల్లో విరక్తి మొదలైందని అన్నారు. హైడ్రా పేరుతో సామాన్యులను కూడా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


మొదట అక్రమంగా కట్టుకున్న భవనాలు, విల్లాలు, ఫాంహౌ్‌సలను కూలిస్తే సమర్థించామని, ఇప్పుడు పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకునే షాపులను, పేదల ఇళ్లను కూలుస్తున్నారని మండిపడ్డారు. ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. అక్రమ భవనాలకు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో కడుతున్న ఇళ్లకు అనుమతి ఎందుకు ఇచ్చారని, ఇప్పుడెందుకు కూలుస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ అవుట్‌ డేటెడ్‌ పార్టీ అని, రాష్ట్ర ప్రజలంతా ఆ పార్టీకి నో ఎంట్రీ బోర్డు పెట్టాశారని అన్నారు.

Updated Date - Sep 10 , 2024 | 04:34 AM