Share News

Bathukamma: ముంగిళ్లకు ‘ఎంగిలిపూల’ కళతో..

ABN , Publish Date - Oct 03 , 2024 | 03:35 AM

పచ్చని చెట్లు.. రంగురంగుల పూలు.. కళకళలాడుతున్న చెరువులు, కుంటలతో నిండుతనం సంతరించుకున్న ప్రకృతిని దైవ స్వరూపంగా కొలిచేందుకు వేళైంది.

Bathukamma: ముంగిళ్లకు ‘ఎంగిలిపూల’ కళతో..

పచ్చని చెట్లు.. రంగురంగుల పూలు.. కళకళలాడుతున్న చెరువులు, కుంటలతో నిండుతనం సంతరించుకున్న ప్రకృతిని దైవ స్వరూపంగా కొలిచేందుకు వేళైంది. పల్లె, ఆటాపాటలతో ఆనందంగా జరుపుకొనే బతుకమ్మ ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా మొదలయ్యాయి. తొలిరోజైన బుధవారం రాలుపూలను సేకరించి బతుకమ్మగా పేర్చి ‘ఎంగిలిపూల బతుకమ్మ’గా జరుపుకొన్నారు. హనుమకొండలోని వేయిస్తంభాల గుడి వద్ద బుధవారం సాయంత్రం దాదాపు పదివేల మంది మహిళలు బతుకమ్మ ఆడారు. భాషా సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదారాబాద్‌ రవీంద్రభారతిలో ఉత్సవాలు జరిగాయి. ‘ఒక్కొక్క పువ్వేసి చందమామ’ పేరుతో పాటల పుస్తకాన్ని సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్‌ ఆవిష్కరించారు.

-హనుమకొండ, హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి)

Updated Date - Oct 03 , 2024 | 03:35 AM