Share News

Caste Census: కులగణనపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ వైఖరేంటి?: జాజుల

ABN , Publish Date - Oct 31 , 2024 | 04:39 AM

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నవంబరు 6 నుంచి చేపట్టనున్న కులగణనపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు.

Caste Census: కులగణనపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ వైఖరేంటి?: జాజుల

పంజాగుట్ట, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నవంబరు 6 నుంచి చేపట్టనున్న కులగణనపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. లేకుంటే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వివిధ సంఘాల నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కులగణనకు మద్దతు కూడగట్టేందుకు నవంబరు 3న హైదరాబాద్‌లో అన్ని పార్టీలు, బీసీ, కుల సంఘాలు, మేధావులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని, అలాగే నవంబరు 6 నుంచి 15 రోజుల పాటు అలంపూర్‌ నుంచి అదిలాబాద్‌ వరకు రాష్ట్రవ్యాప్తంగా బీసీ కుల సామాజిక గణన యాత్రను చేపడుతున్నామని తెలిపారు. అనంతరం సంఘం జాతీయ అధికార ప్రతినిధిగా తీగల ప్రదీప్‌ గౌడ్‌, వివిధ జిల్లాల నూతన అధ్యక్షులకు నియామక పత్రాలను అందజేశారు.


  • చంద్రబాబుతో బీసీ నేతల భేటీ

2025లో జాతీయ జనాభా గణనలో బీసీ కుల గణన కూడా జరిగేలా ప్రధాని మోదీతో మాట్లాడి ఒప్పించాలని, ఇందుకు ప్రత్యేక చొరవ చూపాలని జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌, బీసీ సంక్షేమ సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్‌రావులు ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఏపీలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34ు పెంచాలని కోరారు. బుధవారం వారు అమరావతిలోని ఉండవల్లిలో 26 బీసీ సంఘాల ప్రతినిధులతో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం ఏపీ వరద బాధితుల సహాయార్థం రూ.10 లక్షల చెక్కును అందజేశారు.

Updated Date - Oct 31 , 2024 | 04:39 AM