బీదర్ హిందూ సభకు మాధవీలత, ప్రమోద్ ముతాలిక్‌పై నిషేధం
ABN , Publish Date - Dec 09 , 2024 | 04:28 AM
బీదర్‌లో నిర్వహిస్తున్న హిందూ జాగృతి సభకు హైదరాబాద్‌కు చెందిన బీజేపీ మహిళానేత మాధవీలత, శ్రీరామసేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్, కాజల్ హిందూస్తానీ హాజరుకాకుండా జిల్లాలోకి వారి ప్రవేశాన్ని నిషేధిస్తూ అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.
![బీదర్ హిందూ సభకు మాధవీలత, ప్రమోద్ ముతాలిక్‌పై నిషేధం](https://media.andhrajyothy.com/media/2024/20241208/30_dd79751977_v_jpg.webp)
బెంగళూరు, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): బీదర్‌లో నిర్వహిస్తున్న హిందూ జాగృతి సభకు హైదరాబాద్‌కు చెందిన బీజేపీ మహిళానేత మాధవీలత, శ్రీరామసేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్, కాజల్ హిందూస్తానీ హాజరుకాకుండా జిల్లాలోకి వారి ప్రవేశాన్ని నిషేధిస్తూ అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. వక్ఫ్‌బోర్డు ద్వారా రైతులకు జారీ చేసిన నోటీసుల రద్దు, తదితర డిమాండ్లతో శనివారం రాత్రి నుంచి బీదర్‌లోని సాయి పాఠశాల మైదానంలో హిందూజాగృతి సభ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సభకు ప్రమోద్‌ముతాలిక్, మాధవీలత అతిథులుగా హాజరు కావాల్సి ఉంది. వీరి ప్రసంగాలు రెచ్చగొట్టేలా ఉంటాయన్న ఉద్దేశంతో జిల్లాలోకి ప్రవేశించకుండా అధికారులు నిషేధం విధించారు.