Home » Madhavi Latha
Madhavilata Cyber Complaint: జేసీ ప్రభాకర్ రెడ్డి గత ఏడాది డిసెంబర్ 31న తాడిపత్రిలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. తాడిపత్రిలో ఉండే మహిళల కోసం ఈ స్పెషల్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌ను బీజేపీ నేత మాధవిలత తప్పుపట్టారు. అప్పటి నుంచి వీరిమధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
Madhavi Latha: మాధవిలత కీలక నిర్ణయం తీసుకుంది. తనపై పరుష వ్యాఖ్యలు చేసిన జేసీని వదిలిపెట్టేదే లేదంటూ అడుగు ముందుకేసింది. జేసీపై ఫిల్మ్ ఛాంచర్‌లో కంప్లైంట్ ఇచ్చింది. అంతేకాదు..
JC Prabhakar Reddy vs Madhavi Latha: సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవి లతకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. మరి ఆయన ఎందుకు క్షమాపణలు చెప్పారు? అసలు ఏమైంది..? పూర్తి వివరాల కోసం ఈ కథనం చదవాల్సిందే..
బీదర్‌లో నిర్వహిస్తున్న హిందూ జాగృతి సభకు హైదరాబాద్‌కు చెందిన బీజేపీ మహిళానేత మాధవీలత, శ్రీరామసేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్, కాజల్ హిందూస్తానీ హాజరుకాకుండా జిల్లాలోకి వారి ప్రవేశాన్ని నిషేధిస్తూ అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.
Andhrapradesh: హిందువులు పవిత్రంగా స్వీకరించే శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారంటే అది అత్యాచారం కిందకే వస్తుందంటూ మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా వెంకటేశ్వరస్వామికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా తిరుమలకు వెళ్లాలని ఆమె నిర్ణయించారు.
వేంకటేశ్వరుని ప్రసాదాన్ని కల్తీ చేయడం మహా పాపమని బీజేపీ నాయకురాలు మాధవిలత అన్నారు. ధర్మాన్ని తాను పాటిస్తూ శ్రీవారి నామస్మరణ చేస్తూ వైష్ణవ దేవాలయాన్ని దర్శించుకుంటానని చెప్పారు. ఈనెల 26 వరకు తిరుమలకు చేరుకుంటానని అన్నారు. అలిపిరి నుంచి కొండపైకి కాలినడకన వెళ్లి తన వినతిపత్రాన్ని శ్రీవారికి అందజేస్తానని మాధవిలత పేర్కొన్నారు.
తిరుమల లడ్డూ వ్యవహారంపై(Tirupati Laddu Row) బీజేపీ సీనియర్ నేత మాధవి లత(Madhavi Latha) స్పందించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఆమె శుక్రవారం మాట్లాడారు. తిరుపతి ప్రసాదం విషయంలో ఇలా జరగడంపై భావోద్వేగానికి గురయ్యారు.
హైదరాబాద్(hyderabad) లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవి లత(madhavi latha) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై తాజాగా ఎంఐఎం నేతలపై కేసు నమోదైంది. మాధవి లత అనుచరుడు నసీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొగల్ పురా పోలీసులు(police) కేసు నమోదు చేశారు.
పోలింగ్ బూత్ వద్ద ఓ ముస్లిం మహిళ ఓటు వేయకుండా వెనుదిరగడానికి కారణమయ్యారంటూ హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మాధవీలతపై మలక్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించారంటూ.. మంగళ్‌హాట్ పోలీసులు కూడా ఆమెపై కేసు పెట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. మలక్‌పేటలోని ఆస్మాన్‌గఢ్ హోలీమదర్స్ గ్రామర్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్(నంబర్ 64)ను బీజేపీ అభ్యర్థి మాధవీలత సందర్శించారు.
ఎంఐఎం పార్టీకి హైదరాబాద్ లోక్‌సభ స్థానం కంచుకోట అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ స్థానం నుంచి ఎంఐఎం అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వరుసగా గెలుస్తున్నారు.