Share News

Telangana Formation Day: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్

ABN , Publish Date - Jun 01 , 2024 | 07:47 AM

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ముఖ్యంగా ట్యాంక్‌బండ్, పరేడ్ గ్రౌండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.

Telangana Formation Day:  హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్

హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ముఖ్యంగా ట్యాంక్‌బండ్, పరేడ్ గ్రౌండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ట్యాంక్‌బండ్‌పై శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి 12 గంటల వరకు, గన్‌పార్క్ వద్ద ఆదివారం ఉదయం 9. గంటల నుంచి 10 గంటల వరకు.. అలాగే పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు వాహనాల రాకపోకలపై అధికారులు ఆంక్సలు విధించారు. కాబట్టి ఈ ప్రాంతాలకు వెళ్లాలనుకునే కాస్త అప్రమత్తంగా ఉండాలి.

AP High Court : ‘బ్యాలెట్‌’ ఉత్తర్వులు సరైనవే

Read more Telangana News and Telugu News

Updated Date - Jun 01 , 2024 | 12:10 PM