TG Politics: తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. కాంగ్రెస్ నుంచి మళ్లీ బీఆర్ఎస్‌లోకి ఎమ్మెల్యే..?
ABN , Publish Date - Jul 30 , 2024 | 01:36 PM
తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఎంతమంది గులాబీ పార్టీ కీలక నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు జంప్ అయ్యారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే..
పెద్ద ట్విస్టే..?
తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం
మళ్లీ బీఆర్ఎస్‌లోకి గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి..?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన కృష్ణ మోహన్ రెడ్డి
కారు పార్టీలోనే ఉంటానని మాటిచ్చినట్లు సమాచారం
ఇటీవలే కాంగ్రెస్ కండువా కప్పుకున్న గద్వాల్ ఎమ్మెల్యే
పార్టీలో చేరుతున్నప్పుడు ఎంతో హైడ్రామా..!
ఇంట్రెస్టింగ్ కామెంట్స్
త్వరలో బీఆర్ఎస్ అధినేతను కేసీఆర్‌ను కలుస్తానంటున్న ఎమ్మెల్యే
నేను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటున్న కృష్ణ మోహన్
కేటీఆర్‌తో భేటీ తర్వాత మీడియాతో గద్వాల ఎమ్మెల్యే చిట్ చాట్
నా మీద డీకే అరుణ, సరిత కోర్టులో పిటిషన్ వేశారు
నా పక్షాన ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీనే..
లాయర్‌ను పెట్టి కోర్టులో వాదించారు : కృష్ణ మోహన్
కేటీఆర్ ఓకే అనేశారుగా!
ఇటీవల బీఆర్ఎస్ లాయర్‌ను తొలగించింది
లాయర్‌ను ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ను కోరాను
అవసరమైతే లాయర్ ఫీజు నేనే చెల్లిస్తానని కూడా చెప్పాను
కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు..
ఎల్లుండి కోర్టులో వాయిదా ఉంది : గద్వాల్ ఎమ్మెల్యే